జిల్లాలో రూ.12.56 కోట్ల ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2020-06-05T09:52:06+05:30 IST

వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర ద్వారా జిల్లాలో రూ. 12.56 కోట్ల ఆర్థికసాయాన్ని పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ..

జిల్లాలో రూ.12.56 కోట్ల ఆర్థిక సాయం

వాహనమిత్ర ద్వారా 12567 మందికి లబ్ధి

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర ద్వారా జిల్లాలో రూ. 12.56 కోట్ల ఆర్థికసాయాన్ని పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. తద్వారా 12567 మందికి లబ్ధి చేకూరిందన్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రెండోవిడత ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మా ధవ్‌, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యేలు ఉషశ్రీచరణ్‌, జొన్నలగడ్డ పద్మావతి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా గతేడాది 10918 మంది ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిందన్నారు. ఈ ఏడాది మరో 1649 మందికి అదనంగా లబ్ధి చేకూర్చామన్నారు.


ఆర్థికసాయాన్ని ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్ల ఖాతాలకు జమ చేశామన్నారు. అనంతరం రూ.12.56 కోట్ల మెగా చెక్కును అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రైవర్లకు అందజేశారు. ఇదే సందర్భంలో జగనన్నకు థ్యాంక్స్‌ అంటూ వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పోస్టర్లను కలెక్టర్‌తోపాటు ప్రజాప్రతినిధులు ఆటోలకు అతికించారు. కార్యక్రమంలో జేసీ నిశాంత్‌కుమార్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ శివరాంప్రసాద్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T09:52:06+05:30 IST