నియోజకవర్గానికి 16 వేల బోర్లు

ABN , First Publish Date - 2020-09-29T16:50:12+05:30 IST

వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 10 బోర్‌ డ్రిల్లింగ్‌ మిషన్లు..

నియోజకవర్గానికి 16 వేల బోర్లు

ఒకసారి ఫెయిల్‌ అయితే రెండో బోరు

‘జలకళ’ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు: వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 10 బోర్‌ డ్రిల్లింగ్‌ మిషన్లు అందిస్తున్నా మని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పే ర్కొన్నారు. జలకళ పథకాన్ని రాజధాని నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించగా నెల్లూరు జడ్పీ కార్యాలయంలోని ఎమర్జెన్సీ కేంద్రం నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులు వీక్షించారు. అనంతరం పచ్చ జెండా ఊపి డ్రిల్లింగ్‌ వాహనాలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 16వేల నుంచి 17వేల బోర్లు వేయాలని లక్ష్యం గా  నిర్ణయించుకున్నామని, దీని కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. పొలంలో బో రు తవ్వించుకోవాలనుకునే రైతులు గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకో వాలన్నారు.


అధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్‌ రైతు పొలంలో బోరుబావి తవ్వు తారని చెప్పారు. బోర్‌ వేసేందుకు, సర్వే చేసేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒకసారి బోర్‌ వెల్‌ విఫలమైతే మరోసారి కూడా వేస్తారని, ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సా మాజిక ఆడిట్‌ నిర్వహిస్తామన్నారు. వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఈ  పథకం ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్‌ రంగారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చల పతిరావు, ఆఫ్కాప్‌ చైర్మన్‌ కే అనిల్‌బాబు, డ్వామా పీడీ కే సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T16:50:12+05:30 IST