పెరంబూర్(చెన్నై): అరియలూరు జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లడంపై అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు వారంలో ఒకరోజు వాహనాలు వదలి సైకిళ్లు, బస్సుల్లో రావాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు అరియలూరు కలెక్టర్ రమణ సరస్వతి ఇంటి నుంచి నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇకపై సోమ, బుధవారాల్లో ఇంటి నుంచి నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లాని నిర్ణయించినట్టు, అందరు అధికారులు, ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.