నత్తనడకన కలెక్టరేట్‌ భవనం

ABN , First Publish Date - 2021-10-20T05:00:44+05:30 IST

పాడింది పాడురా పాసుపళ్ల దాసుడా... అన్న చందనా ఉంది జిల్లాలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం.

నత్తనడకన కలెక్టరేట్‌ భవనం

మూడేళ్లయినా సాగుతున్న నిర్మాణం..

మంత్రులు, కలెక్టర్‌ ఆదేశించినా కదలని పనులు

కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టొబరు 19: పాడింది పాడురా పాసుపళ్ల దాసుడా... అన్న చందనా ఉంది జిల్లాలో చేపట్టిన  సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం. మంత్రులు, కలెక్టర్‌ ని ర్మాణం పనులు వేగవంతం చేయాలని, దసరానాటికి కార్యా లయాన్ని పూర్తి స్థాయిలో పనులు చేసి వినియోగంలోకి తేవాలని ఆదేశాలిచ్చినా గుత్తేదారులో ఎలాంటి చలనం కన్పించడంలేదు. నిర్ణీత కాలం పూర్తయి 20నెలలు గడిచినా ఇంకా 30శాతం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పరిపా లనా సౌలభ్యం, పారదర్శకత, ప్రజలకు అన్ని జిల్లా కార్యాల యాలు ఒకే ప్రాంతంలో ఉండలానే లక్ష్యంతోరూ 45కోట్లతో 2017లో జిల్లాకు సమీకృత  కలెక్టరేట్‌ భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.  తొలుత రూ 38.38కోట్లతో కలెక్టరేట్‌ భ వనం,  సుమారు 7కొట్లతో జిల్లా అధికారులనివాస సము దాయానికి టెండర్లు ఖరారై జనవరి 2020 నాటికి పూర్తి చే యాలనే లక్ష్యంతో నిర్మాణం పనులు చేపట్టారు. ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ పర్యవేక్షణలో ఈ నిర్మాణాలు జరుగుతు న్నాయి. తొలుత భూసేకరణలో జరిగిన జాప్యం కారణంగా ఆరు నెలల పాటు పనులు ప్రారంభం కాలేదు. 2018 జన వరిలో భూసేకరణ పూర్తిచేసి పనులకు శ్రీకారం చుట్టారు. రెండు సంవత్సరాల కాలంలో పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినా నేటకి కేవలం 70శాతం పనులు మాత్రమే జరి గాయి. నిర్ధేశించిన సమయం పూరై 20 నెలలు గడిచిని ఇం కా 30శాతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గట్టిగా పనులు చేపడితే ఇంకా ఆరు నెలల వ్యవధి పడుతోంది. ఈ నెల 15 నాటికి భవనం పూర్తిచేసి వినియోగంలోకి తేవా లన్నా మంత్రులు, కలెక్టర్‌ ఆదేశాలు అచరణలో అమలు కాలేదు, దసరా పాయే... కలెక్టరేట్‌ పూర్తికాక పాయే అన్న చందనా సమీకృత కలెక్టర్‌ భవన నిర్మాణం పనులు సాగు తున్నాయి. తొలుత  పనులు వేగవంతంగా సాగిని ఆర్వాత నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల కాలంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పనులు పెండింగ్‌ పెట్టిన గుత్తే దారు బిల్లులు చెల్లించినా పనులు మొదలు పెట్టలేదు.  రా ష్ట్రంలో మొట్టమొదటి కలెక్టరేట్‌ భవనం భద్రాద్రి కొ త్తగూడెంలో  ప్రారంభోత్సవం జరుగుతుందనేలా పనులు సాగాయి. ఆ తర్వాత బిల్లుల చెల్లింపులో జాప్యం, ఇసుక కొ రత, కరోనా ఉధృతితో నిర్మాణం పనులకు బ్రేక్‌ పడింది. ప్ర భుత్వం గత రెండు నెలల క్రితం బిల్లు బకాయిలు చెల్లించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించింది. కాని గుత్తేదారులో ఎలాంటి చలనం లేదు., ఆరు నెలల క్రితమే మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 2021 అక్టోబర్‌లో దస రాకు కొత్త కలెక్టరేట్‌ భవనం పూర్తి చేసి ప్రజలకు అం దుబాటులోకి తెస్తామని, పనులపై కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ఆ తర్వాత కలెక్టర్‌ అనుదీప్‌ పలుమార్లు ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులతో, గుత్తేదారుతో సమావేశం నిర్వహించి పనుల విషయంలో మందలించినా పనులు మాత్రం జరగడంలేదు. దీంతో దసరాకు కొత్త కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవం హుళ్లక్కే అయింది. నిర్మా ణంలో ఇప్పటి వరకు రూ.25.08కోట్ల పనులు పూర్తి అయ్యా యని, ఇంకా రూ.28.07కోట్ల పనులు పురోగతిలో ఉన్నా యన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో రెండవ అదనపు కలెక్ట ర్‌ చాంబర్‌, నివాస సమూదాయపుగృహా నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలన్నారు. జరుగుతున్న పనులకు ప్రత్యా మ్నాయంగా నీటి సరఫరా, గార్డెనింగ్‌, వ్యర్థాలు నిర్వాహాణ ప్లాంటు, నీరు, హార్వెసింగ్‌, విద్యుత్తు సరఫరా పనులన్నీ జాప్యం లేకుండా చేయాలని గత కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అప్పట్లోనే సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించి పనులు నిరంతం రాయంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముగ్గురు కలెక్టర్‌లు మారినా  సమీకృత కలెక్టరేట్‌ భవనం మాత్రం పూర్తి కాలేదు. ఇంకా కలెక్టరేట్‌ భవనంలో కలరింగ్‌, కరెంట్‌, ఫ్లోరింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయి, ప్లబింగ్‌,శానిటేషన్‌ పనులు ఇంకా చేపట్టలేదు. అధికారుల నివాస సముదా యాలు ఇటుక పనులు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా ప్లాస్టింగ్‌ పనులు చేయాల్సి ఉంది. పరిస్థితిని బట్టి అంచనా వేస్తే వచ్చే ఏడాది దసరాకు పనులు పూర్తయ్యేలా ఉన్నా యి. దీంతో ప్రజలకు కొత్త కలెక్టరేట్‌ అందుబాటులోకి రావా లంటే మరో ఏడాది వేచి చూడాల్సింది అనేలా గుత్తేదారు పని ఉంది. 


Updated Date - 2021-10-20T05:00:44+05:30 IST