Abn logo
Mar 30 2020 @ 05:44AM

తొలిరోజు 14.46 శాతం రేషన్‌ పంపిణీ

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 29: జిల్లాలో తొలిరోజు 14.46 శాతం కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. మొత్తం 11.33 లక్షలకుపైగా కార్డుదారులున్నారు. ఆదివారం 1,64,013 కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పును ఉచితంగా ఇవ్వగా.. నగదు తీసుకుని అరకిలో పంచదార పంపిణీ చేసినట్లు వివరించారు. చౌకదుకాణాల వద్ద సమదూరం పాటించేలా చతురస్రాలు, రింగ్‌లు వేశామన్నారు. సరుకులను ఏప్రిల్‌ 15వ తేదీవరకు తీసుకోవచ్చని పేర్కొన్నారు. 


మూడు విడతల్లో పంపిణీ

ఏప్రిల్‌ నెల కోటా రేషన్‌ను మొత్తం మూడుసార్లు పంపిణీ చేయనున్నట్లు జేసీ మార్కొండేయులు తెలిపారు. తొలి విడత ఆదివారం ప్రారంభమవగా, రెండో విడత ఏప్రిల్‌ 15 నుంచి, మూడో విడత పంపిణీని 29వ తేదీన ప్రారంభిస్తారు.

Advertisement
Advertisement
Advertisement