Abn logo
Aug 10 2020 @ 05:51AM

నేడు కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదివారం కలెక్టర్‌ భరత్‌గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. జనం గుంపులుగా చేరితే కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు వ్యయప్రయాసల కోర్చి చిత్తూరు రావద్దని ఆయన సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement