Abn logo
Aug 13 2020 @ 04:45AM

డంపింగ్‌యార్డు పనుల్లో అలసత్వంపై కలెక్టర్‌ ఆగ్రహం

తాండూర్‌(బెల్లంపల్లి), ఆగస్టు 12:  తాండూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లెప్రగతిలో చేపడుతున్న డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల పనుల్లో అలసత్వంపై కలెక్టర్‌ భారతి హోళికేరి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులతో, సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై చర్చించారు. మండలంలోని పలు గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలపై సర్పంచులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించా రు.  సమావేశంలో తహసీల్దార్‌ కవిత, ఎంపీపీ ప్రణ య్‌, సూపరింటెండెంట్‌ వేణు పాల్గొన్నారు. 


భీమిని: రైతు సంక్షమం కోసం తెలంగాణ ప్రభు త్వం నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను వేగంగా పూర్తి చేయాలని ్ల కలెక్టరు భారతి హోళికేరి అన్నారు. బుధవారం  మండలంలోని రాంపూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను ఆమె తనిఖీ చేశారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, ఏడీఏ ఇంతియాజ్‌ హైమ్మద్‌, పంచాయతీ రాజ్‌ డీఈ గిరీష్‌ కుమార్‌, ఎంపీడీఓ రాధాకృష్ణ, సర్పంచులు సంతోష్‌, ఎల్లాగౌడ్‌, నాయకులు మహేష్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.


కన్నెపల్లి: మండలంలో చేపడుతున్న రైతు వేదిక భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. బుధవారం మండలంలోని జన్కాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఆమె వెంట సర్పంచ్‌ చునార్కర్‌ వసంతరాజేందర్‌, డీఏవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రకాష్‌, ఏవో శ్రీకాంత్‌, ఏడీఏ ఇంతియాజ్‌ అహ్మద్‌, డీఈ గిరీష్‌ , ఏవో వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శి శ్వేత, ఉన్నారు. 

Advertisement
Advertisement