ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-28T05:30:00+05:30 IST

ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ ఆగ్రహం
హౌసింగ్‌పై అధికారులతో చర్చిస్తున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

వీరబల్లి, జూన్‌ 28: ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగ ళవారం సచివాలయ ఇంజనీర్లు, కార్యదర్శు లు, మండల అధికారులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. పంచాయతీల వారీ గా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులతో మాట్లాడారు. ఇంకా ప్రారంభం కానీ, పూర్తి అయిన వాటిని అడిగి తెలుసుకుని ఎందు కు నిర్మాణం చేపట్టడం లేదని హెచ్చరిం చారు. పలువురు బిల్లులు సక్రమంగా రావ డం లేదని చెప్పడంతో అక్కడి నుంచి ఫోన్‌ ద్వారా హౌసింగ్‌ పీడీతో మాట్లాడి బిల్లులు ఎందుకు ఆలస్యం  చేస్తున్నారని అడిగి త్వరగా వచ్చేలా చూడాలని చెప్పారు. ప్రారంభం కాని ఇళ్లు త్వరగా నిర్మాణం చేసుకునేలా చూడా లని సూచించారు. అనంతరం వీరబల్లి సచివా లయాన్ని కలెక్టర్‌ ఆసక్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక, నోటీసు బోర్డును, ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌, ప్రజా సమస్యల పరిష్కార నివేదికలను చూశారు. సచివాలయ వ్యవస్థ చాలా కీలకమని వచ్చే వారిని మర్యాద పూర్వ కంగా పలకరించి వారి సమస్యలు తీర్చాల న్నారు. ఈ శ్రమ్‌ పోర్టర్‌లో ఎంత మదికి నమోదు చేశారని ఎంపీడీవో వెంకట సుబ్బయ్యను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య చర్యలపై ఆరా తీసి తడి, పొడి చెత్త సేకరిస్తున్నారా లే దా అని ఆరా తీశారు. కార్యక్రమంలో వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, తహసీల్దార్‌ తులసమ్మ, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:30:00+05:30 IST