ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-08-04T11:13:09+05:30 IST

జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న భవన నిర్మాణాల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదని కలెక్టర్‌ ..

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 3: జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న భవన నిర్మాణాల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తం గా రూ. వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ నిర్మాణ పనులు మంజూరు చేసినా ఆశించిన విధంగా నిర్మాణాలు ఎం దుకు పూర్తికావడం లేదని కలెక్టర్‌ ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలు లో సోమవారం ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో 36, కందుకూరు డివిజన్‌లో 35, మార్కాపురం డివిజన్‌లో నాలుగు సచివాలయాలకు స్థలాల కొరత ఉందని ఈ సం దర్భంగా ఇంజనీరింగ్‌ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ స్థలాల సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి  పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.    సమావేశంలో జేసీలు వెంకట మురళీ,  టీఎస్‌ చేతన్‌, డ్వామాపీడీ శీనారెడ్డి, డీఈవో సుబ్బారావు, పీఆర్‌ ఎస్‌ఈ కొండయ్య, ఆర్డీవోలు ప్రభాకర్‌ రెడ్డి, శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు

 జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని  కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. కరోనా కేసుల నేపథ్యంలో అధికారులు, వైద్యులు పోరాటానికి సంసిద్ధం కావాల న్నారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మార్కాపురంలో జార్జి ఇంజనీరింగ్‌ కళాశాలలో 500 బెడ్లతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సిద్ధం చేయాలన్నారు. మిగతా చోట్ల అవసరమైన బెడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు. జేసీ టీఎస్‌ చేతన్‌,డీఆర్వో కృష్ణవేణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T11:13:09+05:30 IST