ఎన్నికలకు.. సిద్ధం

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

గుంటూరు నగరపాలకసంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ మునిసిపాలిటీల్లో మాత్రమే ఎన్నికల జరుగుతాయన్నారు.

ఎన్నికలకు.. సిద్ధం

ఓట్ల శాతం పెంచడంపై దృష్టి

డబ్బు, మద్యం అరికట్టేందుకు నిఘా

మున్సిపాలిటీల్లో సమస్యాత్మక బూత్‌ల గుర్తింపు

ఆంధ్రజ్యోతితో జిల్లా ఎన్నికల అఽధికారి వివేక్‌యాదవ్‌


‘పురపోరుకు సిద్ధంగా ఉన్నాం.. బుధవారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం.. ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఇప్పటికే అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం.. గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం.. అదే స్ఫూర్తితో మునిసిపల్‌ ఎన్నికలను కూడా పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. 


గుంటూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):  గుంటూరు నగరపాలకసంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ మునిసిపాలిటీల్లో మాత్రమే ఎన్నికల జరుగుతాయన్నారు. మాచర్ల, పిడుగురాళ్ల తీసేయగా మిగతా మునిసిపాలిటీల్లో 9,77,036 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 290 డివిజన్లు/వార్డులను 51 సెక్టార్లు, 105 రూట్లుగా విభజించామన్నారు. అన్నింటికి రూట్‌మ్యాప్స్‌ కూడా సిద్ధం చేశామని చెప్పారు. కనీసం 90 శాతం పోలింగ్‌ నమోదుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం నియంత్రించేందుకు గట్టి నిఘా పెట్టాం. బార్లపై ప్రత్యేకించి దృష్టి సారించాం. గత ఏడాది ఈ సీజన్‌లో ఎంత లిక్కర్‌ విక్రయాలు జరిగాయి, ఈ సారి ఎంత జరిగిందనేది లెక్కలు చూస్తోన్నామన్నారు. డబ్బు పంపిణీని అరికట్టేందుకు ప్రతీ వార్డు/డివిజన్‌కు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ని నియమించామన్నారు. ఈ నెల 10న స్థానిక సెలవుదినంగా ప్రకటించినందున ఓటర్లంతా వీలు చేసుకుని తప్పక పోలింగ్‌ బూత్‌ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. 


 ఇక్కడ ఎన్నికలు లేవు: జిల్లాలో మాచర్ల, పిడుగురాళ్ల మునిసిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమైనందున అక్కడ పోలింగ్‌ జరగడం లేదన్నారు. గుంటూరు నగరంలో ఒకటి, తెనాలిలో 2, చిలకలూరిపేటలో 3, రేపల్లెలో 4, సత్తెనపల్లిలో 4, వినుకొండలో ఏడు చోట్ల ఏకగ్రీవాలు అయినందున అక్కడ పోలింగ్‌ జరగదని తెలిపారు. 


సిబ్బంది నియామకం : పోలింగ్‌ కోసం 87 మంది ఆర్‌వోలు, మరో 87 మంది అదనపు ఆర్‌వోలు, 69 మంది ఏఈవోలు కలిపి 243 మందిని నియమించాం. అలానే 10 శాతం రిజర్వు సిబ్బందిని అందుబాటులో ఉంచాం. 1,186 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,186 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, 3,557 మంది పోలింగ్‌ అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలుకు 24 ఎంసీసీ టీమ్‌లు, 13 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 13 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లు, 25 వీడియో సర్వైలెన్స్‌ బృందాలు, 25 వీడియో పరిశీలన బృందాలను నియమించామని చెప్పారు.


సమస్యాత్మక బూత్‌లు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో 335 అత్యంత సమస్యాత్మక, 284 సమస్యాత్మక, 459 సాధారణ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుని పెంచడంతో పాటు సీఐ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. గుంటూరు నగరంలో 521, తెనాలిలో 151, చిలకలూరిపేటలో 105, రేపల్లెలో 35, సత్తెనపల్లిలో 62, వినుకొండలో 44 పోలింగ్‌ కేంద్రాలను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశామన్నారు.


శిక్షణ.. స్లిప్పుల పంపిణీ: పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సిబ్బందికి పూర్తిస్థాయిలో మూడు సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సిద్ధం చేశాం. పోలింగ్‌ కోసం గుంటూరు నగరంలో 600 పెద్ద సైజు బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులోకి తీసుకొచ్చాం. సత్తెనపల్లిలో 80, తెనాలిలో 167, రేపల్లెలో 47, చిలకలూరిపేటలో 132, వినుకొండలో 62 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశామన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తి చేయడంతో పాటు పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నాం. ప్రతీ పోలింగ్‌ బూత్‌లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్‌ స్లిప్పులను 100 శాతం పంపిణీ చేశామని తెలిపారు. 


ఓటర్‌ సెర్చ్‌.. హెల్ప్‌లైన్‌

గుంటూరు(కార్పొరేషన్‌): గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబం ధించి ఓటు వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యే కంగా యాప్‌ను రూపొందించారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. ఓటు వివరాలు ఓటర్లే నేరుగా తెలుసుకునేందుకు ‘గుం టూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎలక్షన్స్‌ 2021 ఓటర్‌ సెర్చ్‌ హెల్ప్‌లైన్‌’ అనే యాప్‌ను రూపొందించా రు. ఈ యాప్‌ను ఆదివారం నగర కమిష నర్‌ చల్లా అను రాధ విడుదల చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు వివరాలు, పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉప యోగపడుతుం దన్నారు. ఈ యాప్‌ ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.  ఓటర్‌ ఐడీ, ఓటర్‌ పూర్తి పేరు, డోర్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటర్‌ కార్డు, పోలింగ్‌ స్టేషన్‌ వివరాలు డిస్ప్లే అవుతాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బుధవారం జరిగే పోలింగ్‌ కు తరలిరావాలని కోరారు. ఓటు హక్కును వినియోగిం చుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సూచించారు.


 

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST