అధికారుల సమష్టి కృషితో అభివృద్ధి పథంలో జిల్లా

ABN , First Publish Date - 2021-01-27T04:59:15+05:30 IST

అధికారుల సమష్టి కృషితో అభివృద్ధి పథంలో జిల్లా

అధికారుల సమష్టి కృషితో అభివృద్ధి పథంలో జిల్లా
కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి

కలెక్టర్‌ హరిత ..  సాదాసీదాగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, జనవరి 26 : అధికారుల సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతున్నట్లు కలెక్టర్‌ ఎం.హరిత తెలిపారు. మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో జాతీయ జెండాను కలెక్టర్‌ ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రభుత్వాల పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ తాగునీరును కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఆర్‌.మహేందర్‌రెడ్డి, డీఆర్‌వో హరిసింగ్‌, అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, జడ్పీ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, ఆర్‌డీవో మహేందర్‌జీ, పీడీ సంపత్‌రావు, జడ్పీ సీఈవో రాజారావు, అగ్రికల్చరల్‌ జేడీ ఉషాదయాల్‌, భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి, ఏసీపీలు నరే్‌షకుమార్‌, ఫణింధర్‌, సీఐ కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

నిరాడంబరంగా వేడుకలు

ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఎలాంటి అవార్డులు ఇవ్వకపోవడం శోచనీయం. ప్రతీ సంవత్సరం హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే వేడుకలను ఈసారి కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించారు. జిల్లా ప్రజలనుద్దేశించి ప్రగతి నివేదిక ప్రసంగం కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. వివిధ శాఖల అభివృద్ధి పథకాలతో కూడిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలేవీ లేకపోవడంతో జిల్లావాసులు నిరాశకుగురయ్యారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్‌పర్సన్‌లు రాకపోవడం శోచనీయం. 

అలాగే డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా అధికారి డాక్టర్‌ చల్లా మధుసూదన్‌, డీఈవో కార్యాలయంలో జిల్లా అధికారి డి. వాసంతి జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు.


నర్సంపేట : ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆర్డీవో పవన్‌కుమార్‌ ఎగురవేశారు. జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లా్‌సమెజి స్ర్టేట్‌కోర్టులో న్యాయమూర్తి సాకేత్‌మిత్ర, మునిసిపాలిటీలో కమిషనర్‌ విద్యాధర్‌ జెండాను ఎగురవేశారు. 


పరకాల: పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సివిల్‌ కోర్టులో జడ్జి భూక్య హుస్సేన్‌, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కిషన్‌, పురపాలక సంఘంలో, అమరధామంలో చైర్‌పర్సన్‌ అనిత, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ కార్యాలయంలో ఎక్సైజ్‌ సీఐ జగన్నాథరావు, సివిల్‌ ఆస్పత్రిలో సూపరింటిండెంట్‌ ఆకుల సంజీవయ్య, గ్రంథాలయంలో చైర్మన్‌ బొచ్చు వినయ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 


వర్ధన్నపేట : వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, పోలీసుస్టేషన్‌లో ఏసీపీ రమేష్‌, ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో పద్మ మునిసిపాలిటీలో కమిషనర్‌ రవీందర్‌, రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, జాతీయ జెండాను ఆవిష్కరించారు.


Updated Date - 2021-01-27T04:59:15+05:30 IST