సంక్షేమ పథకాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-11-25T05:25:02+05:30 IST

సంక్షేమ పథకాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

సంక్షేమ పథకాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక


కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతు వేదికలు, రైతు కల్లాలు, పల్లె ప్రకృతి వనాలు, జాతీయ ఉపాధిహామీ పథకం, హరితహారం, డంపింగ్‌యార్డు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్‌ షెడ్‌ల నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, డీపీవో వీరబుచ్చయ్య, అన్ని మండలాల, గ్రామాల ఏపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు వేదికలు, రైతు కల్లాలు, పల్లె ప్రకృతి వనాలు, జాతీయ ఉపాధిహామీ పథకం, హరితహారం, డంపింగ్‌ యార్డు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్‌ షెడ్‌ల నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన హరితహారం, రైతు వేదిక, పల్లె ప్రగతి వనాలు, రైతు కల్లాల పనులను వేగవంతంగా చేయాలని అన్నారు. రైతుబంధు, ఉపాధిహామీ, పల్లె ప్రగతిలో ప్రధాన అంశాలైన స్మశాన వాటికల నిర్మాణాలు, కంపోస్టు షెడ్‌ల నిర్మాణం, డంపింగ్‌ యార్డు నిర్మాణం, నర్సరీలు, ఇంకుడుగుంతల నిర్మాణంలో ఎంపీడీవోలు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ప్రగతివైపు దృష్టి పెట్టాలని కోరారు. డిసెంబర్‌ 31 వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల్లో స్పెషల్‌ ఆఫీసర్లను నియమించి జిల్లా అభివృద్ధి జరిగే విధంగా కృషి చేయాలని, స్థానికంగా ఉన్న మండలస్థాయి అధికారులు బాధ్యతలు తీసుకొని పనులు పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కేశవపట్నం, సైదాపూర్‌, జమ్మికుంట, గన్నేరువరం, చిగురుమామిడి, గంగాధర సగటు కన్నా తక్కువ ఉన్న మండలాలపై దృష్టిపెట్టాలని, పల్లె ప్రగతి పనులు 100 శాతం జరగాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, డీపీవో వీరబుచ్చయ్య, డీఏవో శ్రీధర్‌, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌, మైన్స్‌ ఏడీ అశోక్‌, ఆత్మా పీడీ ప్రియదర్శిని, ఏపీడీ మంజులాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T05:25:02+05:30 IST