రిజిస్ర్టేషన్లను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-19T09:32:10+05:30 IST

భూ రిజిస్ట్రేషన్లను అధికారులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. ఆదివారం సంగెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు

రిజిస్ర్టేషన్లను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్‌

సంగెం, అక్టోబరు 18: భూ రిజిస్ట్రేషన్లను అధికారులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. ఆదివారం సంగెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ ద్వారా  రిజిస్ట్రేషన్లను దసరా నుంచి ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆదేశాలను పాటించాలని సూచించారు. కార్యాలయంలో జరుగుతున్న ట్రయల్‌ రన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌జీ, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేశ్వరరావు, ఏఆర్‌ఐ ఆనంద్‌కుమార్‌, వీఆర్వోలు పాలొన్నారు.


రైతు వేదికను పరిశీలించిన కలెక్టర్‌ 

పర్వతగిరి: పర్వతగిరిలో నిర్మిస్తున్న రైతు వేదికను కలెక్టర్‌ హరిత ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రైతు వేదికలు పూర్తికావాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌ జీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T09:32:10+05:30 IST