సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-29T06:32:54+05:30 IST

అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించవద్దని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించవద్దని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు.  సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యతాంశాలకు కావాల్సిన సమాచారం అందచేయుటలో అలసత్వం వహించకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచే యాలని, ఆలస్యంగా నివేదికలు ఇవ్వడంవల్ల ప్రయోజనం ఉండదన్నారు.


ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్ధం చేసుకొని సమిష్టిగా, సమర్ధవంతంగా పనిచేయాలని, ప్రభుత్వం ప్రతిరోజు ప్రాధాన్యతాంశాలపై నివేదికలు కోరుతున్నట్లు చెప్పారు. అధికారులెవ్వరు ముందస్తు సమాచారం ఇవ్వ కుండా కార్యస్థానం విడిచి వెళ్లరాదన్నారు. సెలవు లభించిన తదుపరి మాత్రమే వెళ్లాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై తక్షణం చర్యలుతీసుకొని నివేధికలు అందజేయాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్‌ కమిషనర్లు వెనుకబాటు లో ఉన్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-29T06:32:54+05:30 IST