ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-11T09:58:14+05:30 IST

సచివాలయ భవన సముదాయాలతో పాటు ఉపాధి హామీ పనుల నిర్వహణలో ప్రభుత్వ లక్ష్యా న్ని అధిగమించేలా అధికారులు ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలి : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), జూలై 10: సచివాలయ భవన సముదాయాలతో పాటు ఉపాధి హామీ పనుల నిర్వహణలో ప్రభుత్వ లక్ష్యా న్ని అధిగమించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల నిర్వహణ, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, సచివాలయాల భవననిర్మాణ పనులు తదితరాలపై శుక్రవారం కలెక్టరేట్‌ వీసీ హాలు నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, జేసీ సాయికాంత్‌ వర్మతో కలసి ఎంపీడీఓలు, డ్వామా, ఏపీడీ, ఏపీఓలు, పంచాయితీ రాజ్‌ ఇంజనీర్లు, సచివాలయ ఇంజనీర్లతో సమీక్షించారు.


కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌-19 విపత్తు నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించి వారి ఆర్థిక జీవన పరిస్థితిని పటిష్టం చేసే దిశగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందు కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అత్యధికంగా పనిదినాలు కల్పించి ఉపాధిని అందించడం జరుగుతోందన్నారు. పంచాయితీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాల పనులను ఇంజనీర్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. నాడు- నేడుతో పాటు సచివాలయ భవన నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ యదుభూషన్‌ రెడ్డి,  పంచాయతి రాజ్‌ ఎస్‌ఈ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-11T09:58:14+05:30 IST