జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-27T06:20:20+05:30 IST

జిల్లా అన్ని రంగాలలో ప్రగతి సాధించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రేతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

- కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, జనవరి 26: జిల్లా అన్ని రంగాలలో ప్రగతి సాధించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రేతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ఉత్సాహంతో పని చేయాలని, భారత స్వాతంత్య్రం కోసం, రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేసిన అమరులకు జోహార్లు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫథకాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని సూచించారు. కాగా కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలు సాదాసీదాగా నిర్వహించారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వెంకట మాధవరావు, టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు, విద్యాలయాల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

కామారెడ్డి టౌన్‌, జనవరి 26: కామారెడ్డి పట్టణంలో  గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యా సంస్థలు, కుల, యువజన, వ్యాపార, స్వచ్చంధ సంఘాల ఆధ్వర్యంలో వాడవాడల దేశ మువ్వన్నెల జెండాను ఎగుర వేసారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌, స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి వారి సేవలను గుర్తుకు చేసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలలో..

జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ అనోన్య జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో 9వ అదనపు న్యాయమూర్తి రమేష్‌బాబు, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గజ్జెల భిక్షపతిలు  జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రేమ్‌కుమార్‌లు జెండా ఆవిష్కరించారు. డిప్యూటీ డీఈవో కార్యాలయం వద్ద డీఈవో రాజు జెండాను ఆవిష్కరించారు.

మున్సిపల్‌ కార్యాలయంలో...

కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవితో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్‌లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయం వద్ద...

కామారెడ్డి జిల్లా గ్రంథాలయం వద్ద గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పున్న రాజేశ్వర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మౌనిక, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో... 

టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ ఇంటి వద్ద జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, నీలం చిన్నరాజులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలతో పాటు ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు బాగయ్య జెండాను ఆవిష్కరించారు.

పలు సంఘాల ఆధ్వర్యంలో..

కామారెడ్డి పట్టణంలోని ముదిరాజ్‌, మున్నూరుకాపు, సువర్ణ కళాకారుల యువజన సంఘం, గంగపుత్ర సంఘం, రియల్‌ ఎస్టేట్‌ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాలపాన చేశారు.  ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం పట్టణ అధ్యక్షుడు గెరిగంటి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి చింతల నీలకంఠం, కార్యవర్గ సభ్యులు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:20:20+05:30 IST