ట్రూ అప్‌ చార్జీల వసూలు దుర్మార్గం: ఐఎఫ్‌టీయూ

ABN , First Publish Date - 2022-08-13T04:55:24+05:30 IST

నోట్ల రద్దు, కరోనా తదితర సమస్యలతో సతమతమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై రాష్ట్ర ప్రభు త్వం విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల భారం మోపడం దారుణం అని ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు మావు లూరి విశ్వనాఽథ్‌ విమర్శించారు.

ట్రూ అప్‌ చార్జీల వసూలు దుర్మార్గం: ఐఎఫ్‌టీయూ
మాట్లాడుతున్న ఐఎఫ్‌టీయూ నేతలు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 12: నోట్ల రద్దు, కరోనా తదితర సమస్యలతో సతమతమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై  రాష్ట్ర ప్రభు త్వం విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల భారం మోపడం దారుణం అని ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు మావు లూరి విశ్వనాఽథ్‌ విమర్శించారు. శుక్ర వారం ఆయన స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడు తూ ఇప్పటికే ప్రజలు చెత్త పన్ను, ఇంటి పన్నుతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలతో సత మతమవుతుంటే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీల పేరిట వినియోగదారులపై రూ.3 వేల కోట్ల భారం మోపడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ఏడు దఫా లుగా విద్యుత్‌ చార్జీలు పెంచి, కేటగిరీలు రద్దు చేసి ప్రజలపై భారం మోపడం అ న్యాయం అన్నారు. ఇచ్చిన హామీలు విస్మ రించి పదే పదే విద్యుత్‌ చార్జీలు  పెంచ డం దారుణమైన విషయమన్నారు. ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేట రీ కమిషన్‌ స్పందించా లని, ప్రభుత్వమే ట్రూ అప్‌ చార్జీల భారం భరించాల న్నారు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, వంటనూనె, నిత్యా వసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగి ఆకాశాన్నంటాయ న్నారు. దీనికితోడు ఏపీఎస్‌ ఆర్టీసీ చార్జీలు కూడా పెంచార న్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు పూసపాటి రమణ, మదన్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T04:55:24+05:30 IST