విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరిస్తున్నారు. జీవీఎంసీ పాలకవర్గం కోటి సంతకాల సేకరణ చేపట్టింది. పార్టీలకు అతీతంగా జీవీఎంసీ పాలకవర్గం సంతకాలు సేకరిస్తోంది. కోటి సంతకాల సేకరణలో ఆంధ్రులంతా భాగం కావాలని జీవీఎంసీ పిలుపునిచ్చింది. విశాఖ ప్లాంట్ కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు దిగుతామని జీవీఎంసీ పాలకవర్గం హెచ్చరించింది. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆందోళనకారులు ఏరోజుకారోజు వినూత్నంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వ హిస్తూ, వివిధ వర్గాల మద్దతు కూడగడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం విరమించే వరకు పోరు ఆగదనే సంకేతాలు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యమనేతలు హెచ్చరికలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి