మహాత్ముడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-08-17T05:17:00+05:30 IST

మహాత్మాగాంధీ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో పాఠశాల విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను మంగళవారం ఆయన వేంకటేశ్వర థియేటర్‌లో వీక్షించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ పాత్ర, ఆయన జీవితంలో వివిధ ఘట్టాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.

మహాత్ముడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం
గాంధీ సినిమా వీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌


సిద్దిపేట టౌన్‌/సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 16: మహాత్మాగాంధీ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో పాఠశాల విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను మంగళవారం ఆయన వేంకటేశ్వర థియేటర్‌లో వీక్షించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ పాత్ర, ఆయన జీవితంలో వివిధ ఘట్టాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా బ్రిటిష్‌ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడు చూపిన బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ స్ఫూర్తితో అందరూ క్రమశిక్షణ అలవర్చుకోవాలని, సమాజాభివృద్ధికి, దేశ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-17T05:17:00+05:30 IST