ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-29T06:07:31+05:30 IST

వర్షాలు కురవడం ప్రారంభం అయ్యే లోగా జగనన్న పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్లలో బేస్‌మట్టాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
పొత్తూరులో పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్‌ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌

కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశాలు

గుంటూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురవడం ప్రారంభం అయ్యే లోగా జగనన్న పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్లలో బేస్‌మట్టాల పనులు పూర్తి చేయాలని  కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం గుంటూరు రూరల్‌ మండలంలోని పొత్తూరు గ్రామంలో లేఅవుట్లలో గృహనిర్మాణ పనుల పురోగతిని నగరపాలకసంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరితో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎదురౌతున్న సమస్యలను అధిగమించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం ఓబులునాయుడు పాలెం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు.  ఆయన వెంట హౌసింగ్‌ పీడీ సాయినాథ్‌కుమార్‌, ఇన్‌ఛార్జ్‌ తహసీల్దార్‌ బిట్టు రమేష్‌, ఓబులునాయుడుపాలెం సర్పంచ్‌ కేసవ హరినాథ్‌, పంచాయతీ కార్యదర్శి రమణయ్య, ఈవో పీఆర్‌డీ రవికుమార్‌, హౌసింగ్‌ ఈఈ సత్యన్నారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-29T06:07:31+05:30 IST