ఆగస్టు 9వ తేదీ లోపు అనుమతులు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T05:08:23+05:30 IST

నాడు - నాడు రెండో దశ అభివృద్ధి పనులకు అన్ని పాఠశాలలు ఆగస్టు 9వ తేదీ లోపు పరిపాలన అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు.

ఆగస్టు 9వ తేదీ లోపు అనుమతులు తీసుకోవాలి

రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌

గుంటూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): నాడు - నాడు రెండో దశ అభివృద్ధి పనులకు అన్ని పాఠశాలలు ఆగస్టు 9వ తేదీ లోపు పరిపాలన అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ నాడు - నేడు రెండో దశ పనులకు సంబంధించి రివాల్వింగ్‌ ఫండ్‌ బిల్లులు అన్ని పాఠశాలలు రెయిజ్‌ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు స్టేట్‌ టెక్స్ట్‌ బుక్స్‌ని కచ్చితంగా తీసుకోవాలన్నారు. లేకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచితంగా సీట్లు భర్తీ చేస్తారని, దీనికి సంబంధించి 10వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. 16 నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లు సేకరిస్తామన్నారు. ఆగస్టు 30వ తేదీన లాటరీ తీసి సెప్టెంబరు 2వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కాగా ఆగస్టు 6వ తేదీన టెట్‌ పరీక్షలు విజయవతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి, డీఈవో శైలజ, ఎస్‌ఎస్‌ఏ ఈఈ సుధాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T05:08:23+05:30 IST