‘డబుల్‌’ పేరుతో డబ్బులు వసూల్‌..!

ABN , First Publish Date - 2020-10-16T06:39:36+05:30 IST

కారేపల్లి మండలంలో పేరుపల్లిలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిగ్రానికి చెందిన అధికార పార్టీకి

‘డబుల్‌’ పేరుతో డబ్బులు వసూల్‌..!

బాధితుల ఆరోపణ

నాసిరకంగా ఇళ్ల నిర్మాణం

ఇళ్ల మధ్య పురాతన బావి

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు


కారేపల్లి, అక్టోబరు 15: కారేపల్లి మండలంలో పేరుపల్లిలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిగ్రానికి చెందిన అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు పెద్దమొత్తంలో గ్రామస్థుల వద్దనుంచి భారీగా డబ్బులు వసులు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇళ్లులేని నిరు పేదలను గుర్తించి స్థలం కొనుగోలు చేసి అందరికి ఇళ్లు కటించి ఇస్తామని నమ్మపలికించి ఇళ్లు అవసరమైనా నిరుపేదలనుంచి ఇంటికి రూ.50వేల  వసులు చేశారు. అయితే కొనుగోలు చేసిన స్థలంలో 70 ఇళ్లు అసంపూర్తి సౌకర్యాలతో, నాసిరకంగా నిర్మాణాలు చేశారు.


అయితే ఇంటికోసం వందమంది వద్ద డబ్బులు వసూలు చేశారు. అయితే లాటరీ పద్దతిలో ఇళ్ల కేటాయింపులు జరపాలి. కాని లాటరీలో 70 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాఇస్తే మిగిలిన 30 మంది లబ్ధిదారులు ఆందోళనకు దిగే పరిస్థితి అక్కడ నెకొంది. ఇటివల జరిగిన గ్రామ సభలో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన పేదలు తమకు ఇళ్లు కేటాంయింపులు జరిపే వరకు ఇక్కడ నుంచి కదలమని ఆందోళనకు దిగారు. గ్రామసర్పంచ్‌ గ్రామస్థులకు సర్ధిచెప్పి పంపించారు.


నాసిరకంగా ఇళ్ల నిర్మాణాలు..ప్రారాభానికి మందే ఊడిపోతున్న తలుపులు, కిటికిలు

పేరుపల్లిలో నిరుపేదలకోసం నిర్మాణాలు చేపట్టిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ప్రారంభానికి ముందే శిఽథిలావస్థకు చేరుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సదరు కాంట్రాక్టర్‌ పూర్తిగా నాసిరకంగా పనులు చేపట్టారు. నాసిరకం తలపులు, కిటికిలు ఏర్పాటు చేశారు. ఇంటిగోడలు చేతితో రుద్దితే గోడ ఎక్కడికక్కడే రాలిపోతుందని గ్రామస్థులు తెలిపారు.


ఇళ్ల పక్కనుంచే కాలువ

పేదల కోసం చేపట్టిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణా లు అత్యంత దయనీయ ప్రదేశాల్లో నిర్మాణాలు చేశారు. డబుల్‌ బెడ్‌ ఇళ్లను ఆనుకుని ప్రవహించే నాగరాజు కట్టుకాలువ నీరు ప్రహిస్తుండగా, ఇళ్ల నిర్మాణాలు జరిగిన మధ్యన అతిపూరతన మైనా పెద్దబావి ఉంది.

Updated Date - 2020-10-16T06:39:36+05:30 IST