ఎయిడెడ్‌పై వేటు

ABN , First Publish Date - 2021-08-30T05:25:27+05:30 IST

జిల్లాలో దాతల దాతృత్వం.. కృషితో అనేక విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. పేరొందిన విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి.

ఎయిడెడ్‌పై వేటు
నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల

దశాబ్దాల చరిత్రకు మంగళం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే చర్యలు

వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం

ఎయిడ్‌ ఉపసంహరిస్తూ జీవో జారీ

కొనసాగించాలని అధ్యాపకులు తల్లిదండ్రుల డిమాండ్‌


   కళాశాల విద్య ఒకప్పుడు అందరికీ అందుబాటులో లేదు. స్తోమత లేక కొందరు.. దూరాభారం వెళ్లలేక మరికొందరు అరకొర చదువులతో సరిపెట్టుకునేవారు. ఈ పరిస్థితుల్లో దాతలు.. వదాన్యులు ఎందరో ముందు కు వచ్చి చదువు అవసరాన్ని గుర్తించి విద్యాసంస్థలను నెలకొల్పడమే కాకుం డా వాటిని పోషించేవారు. వారికి అప్పట్లో ప్రభుత్వం సహకరించడంతో ప్రముఖ విద్యా సంస్థలుగా వెలుగొం దాయి. ఎందరో పేదలు ఈ విద్యాసంస్థ ల్లో అక్షరాలు దిద్దుకుని ఉన్నత విద్యా వంతులుగా ఎదిగారు. ఎందరో ప్రము ఖులు ఆయా కళాశాలలో చదివారు. ఆయా కళాశాలలు సామాజిక అభివృద్ధికి కూడా దోహద పడ్డాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఎయిడెడ్‌ కళాశాలలపై ప్రస్తుత ప్రభుత్వం వేటు వేసేం దుకు రంగం సిద్ధం చేసింది. జూనియర్‌, డిగ్రీ కళాశాల లకు ఎయిడ్‌ ఉపసంహరించుకుం టున్నట్టు ప్రభుత్వం జీవోతోపాటు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. చారిత్రక నేప థ్యం కలిగిన ఎయిడెడ్‌ కళాశా లలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యాభి వృద్ధికి ఆటకంగా పరణ మిస్తున్నదని విద్యా వేత్తలు ఆందోళన చెందుతున్నా రు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుం డానే సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 



నరసరావుపేట, ఆగస్టు 29: జిల్లాలో దాతల దాతృత్వం.. కృషితో అనేక విద్యాసంస్థలు ఏర్పడ్డాయి.  పేరొందిన విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. విద్యాభివృద్ధికి దాతల సహ కారానికి నాటి ప్రభుత్వాలు కూడా చేయూత అందించాయి. విద్యాసంస్థలను స్థాపించడంతో పాటు దాతలే ఆర్థికంగా పోషించేవారు. సమాజానికి విద్యను అందించారు. ఈ క్రమంలో 1964లో దాతలు స్థాపించిన కళాశాలను నాటి ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలుగా గుర్తించింది. నాటి నుంచి ప్రభుత్వాలు ఆయా విద్యాసంస్థలకు ఎయిడ్‌ను కొన సాగిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేశాయి. గుంటూరు పేరు చెప్పగానే గుర్చొచ్చే ఏసీ కళాశాలను 1885లో స్థాపించారు. 1926లో కో ఎడ్యుకేషన్‌ కళాశాలగా మారింది. 1968లో జేకేసీ కళాశాలను, 1930లో హిందూ కళాశాలను  నెల కొల్పారు. నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలను 1950 స్థాపించారు. జేకేసీ, హిందూ, టీజేపీఎస్‌, నరసరావు పేట, గుంటూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరి చదువుకున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 28 డిగ్రీ, 37 జూనియర్‌ ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో లేనివిధంగా ఎయిడెడ్‌ కళా శాలల్లో అన్ని వసతులు, విశాల మైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయా లు, ఆటస్థలాలతో పాటు అన్ని వసతులతో కూడిన వసతి గృహాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఖరితో ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కళాశాలలో వసతి గృహాలు అంతగా లేవు.


ఎయిడ్‌ పోతే.. ప్రైవేటుగానే..

ఎయిడెడ్‌ కళాశాలల్లో కూడా ప్రభుత్వ కళాశాలల తరహాలోనే ఫీజులు ఉంటాయి. ఎయిడ్‌ను ప్రభుత్వం ఉప సంహరించుకుంటే ఇవి పూర్తిగా ప్రైవేటు కళాశాలలుగా మారిపోతాయి. దీంతో పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ఎయిడెడ్‌ కళాశాలల్లోని విద్యార్థుల ను ప్రభుత్వ కళాశాలలో చేరుస్తామని ప్రభు త్వం చెబుతున్నది. ఇంతమంది విద్యార్థులకు తగిన విధంగా ప్రభుత్వ కళాశాలలు జిల్లాలో లేవు. నరసరావుపేట, గుంటూరులోని ఎయిడెడ్‌ కళాశాలల్లో 15 వేల మందికి పైగా విద్యార్థులు చదువు కుంటున్నారు. ప్రభుత్వం ఎయిడ్‌ను ఉపసంహరించుకుంటే వీరందరూ ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. గుం టూరులో ఎయిడెడ్‌ కళాశాలలు ఎక్కువగా ఉం డగా ప్రభుత్వ కళాశాల ఒక్కటే ఉంది. అది కూ డా మహిళా కళాశాల. ఈ పరిస్థితుల్లో గుంటూ రులోని విద్యార్థులు ఎక్కడకు వెళ్లి చదువుకోవా లో ప్రభుత్వమే చెప్పాలి. ఇక నరసరావుపేటలో ఒక్క ప్రభుత్వ కళాశాల కూడా లేదు.  ఉన్న నా లుగు ఎయిడెడ్‌ కళాశాలల్లోని విద్యార్థులు విను కొండ, మాచర్ల వెళ్లి చదువుకోవడం సాధ్యమేనా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


ఏకపక్షంగా నిర్ణయం

ప్రభుత్వం ఎయిడెడ్‌ రద్దు నిర్ణయం ఏకపక్షంగా  తీసుకున్న ద న్న అభిప్రాయం విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, అధ్యాపకుల నుంచి వ్యక్తమవుతు న్నది. ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసు కోకపోవడం దారుణమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.  విద్యా వ్వవస్థను దెబ్బతీసేదిగా ప్రభు త్వ నిర్ణయం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్క్‌ లోడ్‌ లేకుండానే ఎయిడెడ్‌ కళాశాలలు నిర్వహిస్తు న్నారన్న వాదన ప్రభుత్వం నుంచి వస్తున్నది. ఇక్కడ పని చేసే స్టాఫ్‌కు ఇబ్బందిలేదని చెబుతున్నా విద్యార్థుల విషయంలో స్పష్టమైన విధానాన్ని వెల్లడించడంలేదు. విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలకు పంపుతామని చెబుతున్నప్పటికీ వారికి ఆ కళాశాలలు అందుబాటు లో ఉన్నాయో లేదో కూడా పరిశీలించడంలేదు. వర్క్‌ లోడ్‌ లేని పక్షంలో అటువంటి కళాశాలను గుర్తిం చి చర్యలు తీసుకోవాలే తప్ప అన్ని కళాశా లలకు ఎయిడ్‌ రద్దుకు పూనుకోవడం సరైన విధానం కాదని విద్యావేత్తలు అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


ఎయిడెడ్‌ కళాశాలను కొనసాగించాలి..

ఎయిడెడ్‌ కళాశాలల కొనసాగింపు సామాజిక అవసరం. కళాశాలలను కొనసాగించాలని విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశాం. సాంప్రదాయ కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని ఎయిడెడ్‌ కళాశాలను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఎయిడెడ్‌ కళాశాలల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

 - అక్టా రాష్ట్ర అధ్యక్షుడు కే మోహన రావు


Updated Date - 2021-08-30T05:25:27+05:30 IST