భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచండి

ABN , First Publish Date - 2022-07-01T05:33:47+05:30 IST

గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా అధికారులను ఆదేశించారు.

భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేదితో

పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి ద్వివేది

గుంటూరు,జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై ద్వివేదితో పాటు కమిషనర్‌ కోన శశిధర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.ఈసందర్భంగా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ద్వివేది మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మిస్తోన్న ప్రభుత్వ ప్రాధాన్య భవనాలకు అవసరమైన సిమెంట్‌, ఇసుక అందిస్తోన్నామన్నారు. పెండింగ్‌ బిల్లులు కూడా క్లియర్‌ చేశామన్నారు. నిర్మాణ ఏజెన్సీల ద్వారా పనులు వేగవంతంగా పూర్తి చేయించేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థలాల వివాదాల కారణంగా నిర్మాణాలు ఆగిపోయిన భవనాలకు ప్రత్యామ్నా యంగా భూములు అందించాల న్నారు. ప్రతీ సచివాలయం వద్ద కమ్యూనిటీ శానిటేషన్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంక్పలం అమలు జరుగుతోన్న గ్రామాలకు సంబంధించి ఎండ్‌టూఎండ్‌ వోడీఎఫ్‌ ఫ్రీ గ్రామాలుగా ధ్రువపత్రాలు జారీ చేసేలా చూడాల న్నారు. జగనన్న పాలవెల్లువ పథకం కింద బల్క్‌మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌లు, అమూల్‌ మిల్స్‌ కలెకక్షన్‌ పాయింట్లను త్వరగా నిర్మించాలని ఏపీ డెయిరీ డెవలప్‌ మెంట్‌ కో-ఆపరేటివ్‌ లిమిటెడ్‌ ఎండీ అహ్మద్‌ బాబు జిల్లా అధికారు లను ఆదేశించారు. సమావేశానికి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచిహాజరయ్యారు. అలానే జాయింట్‌ కలెక్టర్‌ గణియా రాజకుమారి, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


ఈవీఎం గోడౌన్ల  తనిఖీల

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గురువారం గుంటూరు ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్‌ వేణు గోపాలరెడ్డి,  ఫిరంగిపురం రేవూడి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్‌లో గోడౌన్లో భద్రపరిచిన వీవీ పాట్స్‌లను జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా గోడౌన్లుకు వేసిన సీళ్లును, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకరరెడ్డి, ఫిరంగిపురం తహసీల్దారు సాంబశివరావు, కలెక్టరేట్‌ ఏవో తాతామోహనరావు, వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు చిరతనగండ్ల వాసు, కేకే గుప్తా, ఓంకార్‌, సీ హెచ్‌ వెంకటేశ్వరరావు, అప్పారావు, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T05:33:47+05:30 IST