Abn logo
Sep 21 2021 @ 23:23PM

పోలింగ్‌ కేంద్రాల మార్పులపై సహకరించాలి

రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు నజీర్‌ అహమ్మద్‌, డీటీలు

 రాజకీయ పార్టీ నేతల సమావేశంలో తహసీల్దార్‌

ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 21: ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని తహసీల్దా రు నజీర్‌ అహ్మద్‌  కోరారు. నియోజకవర్గ పరిధిలో ఏడు పోలీంగ్‌ కేంద్రాలను మరో చోటకు మార్చటంపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో మంగళవారం ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించారు.  స్థానిక తహసీల్దారు కార్యా లయంలో జరిగిన సమావేశంలో తహసీల్దారు నజీర్‌ అహ్మ ద్‌ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో గవిని సర్కిల్లో వున్న శ్రీవాణి విద్యాలయం భవనాలు తొలగిస్తుండటంతో అక్కడవున్న నాలుగు పోలింగ్‌ కేంద్రాలను రాయలసీమ హైస్కూలుకు మార్చటం జరిగిందన్నారు. జమ్మలమడుగు రోడ్డులోని ఐఎంఏ భవనంలో వున్న పోలింగ్‌ కేంద్నాన్ని రెం డవ వార్డు స్కూలులోకి మార్చినట్టు తెలిపారు. మాడరన్‌ స్కూలులోని కేంద్రాన్ని రెండవవార్డు మున్సిపల్‌ హైస్కూల్లోకి మార్చామని, పొట్టిపాడు రోడ్డులోని బీసీ హాస్టల్‌ కేంద్రాన్ని ఉప్పాగు యానాదికాలని స్కూల్లోకి మార్చినట్లు ప్రకటించార ు. ఈ కేంద్రాల మార్పులపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతాలు వ్యక్తం చేయలేదని అందరు ఆమోదించారని తెలిపారు. సమావేశంలో రాజుపాళెం ఇన్‌చార్జ్‌ తహసీల్దారు సాయినాధ్‌ రెడ్డి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు అజయ్‌ బాబు, సీనియర్‌ అసిస్టెంట్‌ విజయలక్ష్మీ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీల ప్రతినిధులు సత్యం సుబ్బరాయుడు నజీర్‌ లక్ష్మీరెడ్డి దస్తగిరి సబ్రమణ్యంలు పాల్గొన్నారు.