నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ

ABN , First Publish Date - 2021-03-03T04:12:04+05:30 IST

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ఆత్మకూరు, మార్చి 2:  జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు పరిధిలో పలు పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమును పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలాలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్‌ కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జీ సువర్ణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమే్‌షబాబు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ సోమయ్య, తహసీల్దారు సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T04:12:04+05:30 IST