ఈ నెలలోనే జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-12T06:08:49+05:30 IST

జిల్లాలోని జర్నలి స్టులందరికీ ఈనెల 31వ తేదీలోపు వ్యాక్సిన్‌ వేయి ంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టరు పోలా భాస్కర్‌ హామీ ఇచ్చారు. అలాగే జ ర్నలిస్టులకు ఇబ్బందిలేకుండా ఆసుపత్రుల్లో బెడ్‌లు కేటాయించేందుకు ప్రత్యేక ఆదేశాలు ఇస్తానని, మృ తిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక చేయూ తనిస్తామని హామీ ఇచ్చారు.

ఈ నెలలోనే జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్‌
కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు, ప్రతినిధులు

బెడ్‌ల కేటాయింపు కోసం ప్రత్యేకాధికారి నియామకం

ఏపీయూడబ్ల్యూజే నేతలకు కలెక్టర్‌ హామీ 




ఒంగోలు కలెక్టరేట్‌, మే 11: జిల్లాలోని జర్నలి స్టులందరికీ ఈనెల 31వ తేదీలోపు వ్యాక్సిన్‌ వేయి ంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టరు పోలా భాస్కర్‌ హామీ ఇచ్చారు. అలాగే జ ర్నలిస్టులకు ఇబ్బందిలేకుండా ఆసుపత్రుల్లో బెడ్‌లు కేటాయించేందుకు ప్రత్యేక ఆదేశాలు ఇస్తానని, మృ తిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక చేయూ తనిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఏపీయూ డబ్ల్యూజే)రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు ఆధ్వ ర్యంలో జిల్లా నాయకులు పలువురు స్థానిక కలెక్టరే ట్‌లో కలెక్టర్‌ను కలిసి చర్చించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ ఒంగోలులోని రిమ్స్‌ వై ద్యశాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రై వేటు వైద్యశాలల్లో కరోనా బాధిత జర్నలిస్టు లు లేక వారి కుటుంబసభ్యులకు త్వరితగతిన పడకలు కేటాయించే బాధ్యతను నోడల్‌ అధికారి వెంకటే శ్వ రరావుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇ స్తున్నట్లు చెప్పారు. యూనియన్‌ తరపున నోడల్‌ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. యూనియన్‌ ప్రతినిధులు తెలిపిన పలు సమస్యలపై ఆయన స్పందిస్తూ మీడియా ప్ర తినిధులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేందు కు ప్రాధాన్యతనిస్తామన్నారు. ఈనెల 31వ తేదీ లో పు అందరికీ వ్యాక్సిన్‌ వేయించేందుకు చర్యలు తీ సుకుంటామని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు కేటా యించే వ్యాక్సిన్‌లో దశల వారీ కొంత జర్నలిస్టులకు వేసేలా ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. యూని యన్‌ తరపున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యు ల జాబితాను తయారు చేసి ఇవ్వాలని, అందులోని వారందరికీ ఒక్కో దశలో 100 నుంచి 200 మం ది కి అవకాశం ఇస్తూ ఈనెల 31లోపు అందరికీ వ్యా క్సినేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. ఇప్పటికే పర్చూరు, సంతనూతలపాడు, మా ర్కాపురంలలో ముగ్గురు జర్నలిస్టులు చనిపో యిన ఉదంతాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా, వారి కుటు ంబాలకు తన పరిధిలో ఉన్న అవకాశం మేరకు ఆ ర్థిక సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి దా సరి కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా అసోసియే షన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్‌రెడ్డి,  జిల్లా నాయకులు ఎం.ప్రసాద్‌, శ్రీను, రాజా పాల్గొన్నారు.


Updated Date - 2021-05-12T06:08:49+05:30 IST