ప్రభుత్వ భవన నిర్మాణాలు త్వరతిగతిన పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-05-13T04:43:31+05:30 IST

జిల్లాలో నిర్మిస్తున్న సచివాలయం, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ క్లీనిక్స్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

ప్రభుత్వ భవన నిర్మాణాలు త్వరతిగతిన పూర్తి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(జడ్పీ), మే 12 : జిల్లాలో నిర్మిస్తున్న సచివాలయం, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ క్లీనిక్స్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, డ్వామా అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్మాంలో ఉన్న భవనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రారంభం కాని భవన నిర్మాణాలను వారం రోజుల్లో ప్రారంభించి నిర్ధిష్టమైన వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ పనులు ద్వారా పేదలకు ఉపాధి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచి బిల్లులు సకాలంలో చెల్లింపులకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు జీవనాఽధారం ఉపాధి పనులేనని, కరోనా నిబంధనలకు అనుగుణంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు నిర్వహించి పేదలకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ తిరుపతయ్య, జడ్పీ సీఈవో సుశీల, డీపీవో ధనలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ రోజ్‌మాండ్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T04:43:31+05:30 IST