delhiని వణికిస్తున్న చలి...ఉష్ణోగ్రత 3.2 డిగ్రీల సెల్సియస్

ABN , First Publish Date - 2021-12-20T15:41:50+05:30 IST

ఢిల్లీలో చలిగాలులు వీస్తున్నందున సోమవారం ఉష్ణోగ్రత 3.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది....

delhiని వణికిస్తున్న చలి...ఉష్ణోగ్రత 3.2 డిగ్రీల సెల్సియస్

సీజన్‌లోనే కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రత

న్యూఢిల్లీ: ఢిల్లీలో చలిగాలులు వీస్తున్నందున సోమవారం ఉష్ణోగ్రత 3.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ ఉష్ణోగ్రత శీతాకాలం సీజన్‌లోనే అత్యల్పమని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో ఆదివారం 7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ చలి గాలుల ప్రభావం మంగళవారం రాత్రి వరకు కొనసాగే అవకాశముంది. చలిగాలుల ప్రభావంతో ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రత 3.2 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.చలి తీవ్రతతో ప్రజలు మంటల చుట్టూ చేరి చలి కాసుకున్నారు.  ప్రస్తుతం ఉత్తర, వాయువ్య భారతదేశంపై చలిగాలులు ప్రభావం ఉంది.  పశ్చిమం నుంచి అతివేగంతో కూడిన మంచు గాలుల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ప్రాంతీయ వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి చెప్పారు. 


రాజస్థాన్‌లోని చురు, సికర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ప్రతికూల స్థాయికి పడిపోయింది. అయితే అమృత్‌సర్, పంజాబ్‌లలో ఉష్ణోగ్రత సున్నా చుట్టూ తిరుగుతోంది.పాకిస్థాన్ దేశంలో కూడా చలిగాలుల  ప్రభావం ఉంది.  బుధవారం నుంచి కొండ ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దీని ప్రభావం డిసెంబర్ 24, 25 తేదీల్లో ఢిల్లీలో కనిపిస్తుంది. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలో మేఘాలు కమ్ముకుంటాయని, అందువల్ల రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో మూడు రోజులపాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలిగాలులు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను తాకాయి.

Updated Date - 2021-12-20T15:41:50+05:30 IST