Imd warning: పలు రాష్ట్రాల్లో వర్షాలు...తీవ్ర చలిగాలులు

ABN , First Publish Date - 2022-01-28T13:09:57+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు వర్షాలతోపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది...

Imd warning: పలు రాష్ట్రాల్లో వర్షాలు...తీవ్ర చలిగాలులు

ఐఎండీ తాజా బులెటిన్ విడుదల 

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు వర్షాలతోపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాతావరణశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో ఈ హెచ్చరిక జారీ చేసింది. జనవరి 29,31 తేదీల్లో జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్గిట్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వతేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీవర్షాలు, మంచు కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో తూర్పు భారతదేశంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది.


వచ్చే 2-3 రోజులలో పంజాబ్, హర్యానా, చండీఘఢ్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో జనవరి 28 నుంచి 30 వరకు ఒడిశా మీదుగా చలిగాలులు వీచే అవకాశముంది.రాబోయే 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో చలిగాలులు వీయవచ్చు. రాబోయే 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా-చండీగఢ్, విదర్భ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో  కోల్డ్ డే పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.శుక్రవారం ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజులలో అండమాన్, నికోబార్ దీవులలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, అరుణాచల్ ప్రదేశ్‌లో అక్కడక్కడ తేలికపాటి / మోస్తరు వర్షపాతం కురిసే అవకాశముంది. 


అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది శుక్రవారం తదుపరి 24 గంటల్లో ఎగువ ప్రాంతంలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది.రానున్న రెండు రోజుల్లో దక్షిణ ఇంటీరియర్ కర్నాటక, రాయలసీమలో, కోస్తా ఆంధ్ర ప్రదేశ్,యానాంలో, రాబోయే మూడు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహారాష్ట్రలో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Updated Date - 2022-01-28T13:09:57+05:30 IST