బాగా చల్లటి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-03-03T17:54:10+05:30 IST

కొంతమంది ఎప్పుడూ చల్లటి నీళ్లు మాత్రమే తాగుతుంటారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఫ్రిజ్‌లో కూల్‌ వాటర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటారు. మరి చల్లటి నీళ్లు శరీరానికి మంచివేనా? అంటే కాదనే అంటున్నారు వైద్యనిపుణులు.

బాగా చల్లటి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

ఆంధ్రజ్యోతి(03-03-2022)

కొంతమంది ఎప్పుడూ చల్లటి నీళ్లు మాత్రమే తాగుతుంటారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఫ్రిజ్‌లో కూల్‌ వాటర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటారు. మరి చల్లటి నీళ్లు శరీరానికి మంచివేనా? అంటే కాదనే అంటున్నారు వైద్యనిపుణులు.


చల్లటి నీళ్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. రోజూ చల్లటి నీళ్లు తాగితే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఫలితంగా మలబద్ధకం, పొట్టలో నొప్పి, గ్యాస్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. చల్లటి నీళ్లు తాగినప్పుడు, ఆ నీటి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఆ నీళ్లు శరీరంలోకి చేరినప్పుడు జీర్ణాశయంలో ఉన్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.బాగా చల్లటి నీళ్లు తాగడం వల్ల వెన్నులోని సున్నితమైన నరాలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెదడు ఫ్రీజ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, సైనస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మెడ నుంచి వెళ్లే వాగస్‌ నాడీ గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. ఒకవేళ బాగా చల్లటి నీళ్లు తాగితే నరాలు వేగంగా చల్లబడతాయి. ఫలితంగా గుండె వేగం, పల్స్‌ రేటు తగ్గిపోతాయి.చల్లటి నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మరింత గట్టిగా మారేలా చేస్తుంది. ఫలితంగా కొవ్వు కరిగించుకోవడం కష్టమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూల్‌ వాటర్‌కు దూరంగా ఉండాలి.వర్కవుట్స్‌ చేసిన తరువాత చిల్డ్‌ వాటర్‌ తాగడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా వేసవిలో ఈ అలవాటు మంచిది కాదు. వర్కవుట్‌ చేసినప్పుడు శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. వర్కవుట్‌ తరువాత వెంటనే చల్లటి నీళ్లు తాగితే ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది. కూల్‌ వాటర్‌ను శరీరం గ్రహించడం కూడా కష్టమవుతుంది.

Updated Date - 2022-03-03T17:54:10+05:30 IST