రెవెన్యూ వర్సెస్‌ కార్యదర్శుల కోల్డ్‌వార్‌

ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST

తమకు తహసీల్దార్‌ కనీస గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడుతున్నారని పంచాయతీ కార్యదర్శులు ఒకవైపు, తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ పంచాయతీ కార్యదర్శులు పనిఒత్తిడి పెంచుతూ మనోవేదనకు గురిచేస్తున్నారని వీఆర్వోలు మరోవైపు ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న ఘటన పామూరు మండలంలో చోటుచేసుకొంది. ఓటీఎస్‌ పత్రాల్లో తహసీల్దార్‌ సంతకం చేయించే దగ్గరే ఈ వివాదం మొదలైంది. ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీ, ఎంపీడీవోకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటీఎస్‌ రిజిస్ర్టేషన్‌ పత్రాల్లో సంతకాలు పెట్టాల్సిన తహసీల్దార్‌ గంటల తరబడి తమను నిలబెడుతున్నారని పేర్కొన్నారు.

రెవెన్యూ వర్సెస్‌ కార్యదర్శుల కోల్డ్‌వార్‌
తహసీల్దార్‌ ఉషకు ఫిర్యాదు చేస్తున్న వీఆర్వోలు

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

లంచాలు మింగుతున్నారని ఆరోపణలు

బయటకు వచ్చిన ఆడియోటేప్‌

పామూరు, జనవరి 24: తమకు తహసీల్దార్‌ కనీస గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడుతున్నారని పంచాయతీ కార్యదర్శులు ఒకవైపు, తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ పంచాయతీ కార్యదర్శులు పనిఒత్తిడి పెంచుతూ మనోవేదనకు గురిచేస్తున్నారని వీఆర్వోలు మరోవైపు ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న ఘటన పామూరు మండలంలో చోటుచేసుకొంది. ఓటీఎస్‌ పత్రాల్లో తహసీల్దార్‌ సంతకం చేయించే దగ్గరే ఈ వివాదం మొదలైంది. ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీ, ఎంపీడీవోకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటీఎస్‌ రిజిస్ర్టేషన్‌ పత్రాల్లో సంతకాలు పెట్టాల్సిన తహసీల్దార్‌ గంటల తరబడి తమను నిలబెడుతున్నారని పేర్కొన్నారు. సాటి ఉద్యోగులని కూడా కనీస గౌరవం  ఇవ్వడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేమని అడిగితే తాను మండల మెజిస్ర్టేట్‌ను అని, తాను చెప్పినట్లే నడవాలంటూ బెదిరిస్తున్నారని ఆమెపై ఆరోపణలు చేస్తూ సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శులపై వీఆర్‌వోలు తహసీల్దార్‌ సీహెచ్‌ ఉషకు ఫిర్యాదు చేశారు. కార్యదర్శులు తమపై పెత్తనం చెలాయిస్తూ అహంకారంతో వ్యహరిస్తున్నారని పేర్కొన్నారు. పనిఒత్తిడి పెడుతున్నారని, ఓటీఎ్‌సపై సంతకాలు చేయించాల్సిన బాధ్యత మీదేనంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.  

మరో అంశంలో ఫోన్‌ రికార్డు వైరల్‌

తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ధర్మతేజతో ఈవోపీఆర్‌డీ వి.బ్రహ్మనందరెడ్డి ఫోన్‌ కాల్‌ ఆడియోను తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది వాట్స్‌పలో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. భూమికి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర రూ.7లక్షల ముడుపులు తీసుకున్నట్లు ఈవోపీఆర్‌డీ ఆరోపించగా, దీనికి ప్రతిగా సీనియర్‌ అసిసెంట్‌ కూడా ఈవోపీఆర్‌డీపై ఆరోపణలు గుప్పించారు. ‘మీరందరూ కూడా ముడుపులు తీసుకోకుండానే పనులు చేస్తున్నారా’ అంటూ నిలదీశారు. ప్రస్తుతం ఈ అంశం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షలో కొందరు వీఆర్వోలు ఆన్‌లైన్‌, మ్యుటేషన్‌ కోసం ముడుపులు తీసుకున్నట్లు ప్రజలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పరువు తీస్తున్నారని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST