సహకారశాఖలో కోల్డ్‌వార్‌

ABN , First Publish Date - 2022-05-28T05:53:20+05:30 IST

జిల్లా సహకారశాఖ అధికారి, ఉద్యోగుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. కొన్ని నెలలుగా ఈ వివాదం కొనసాగుతుండగా, శుక్రవారం బహిర్గతమైంది.డీసీవో కు వ్యతిరేకంగా ఉద్యోగులు, సంఘ నేతలతో కలిసి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.

సహకారశాఖలో కోల్డ్‌వార్‌
డీసీవో కార్యాలయం

డీసీవో, ఉద్యోగుల మధ్య వివాదం

ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపణలు

లోపాలు లేకున్నా మెమోల జారీపై విమర్శలు

బీఎ్‌సఎన్‌ఎల్‌ స్కామ్‌ కేసు సీబీసీఐడీకి


నల్లగొండ: జిల్లా సహకారశాఖ అధికారి, ఉద్యోగుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. కొన్ని నెలలుగా ఈ వివాదం కొనసాగుతుండగా, శుక్రవారం బహిర్గతమైంది.డీసీవో కు వ్యతిరేకంగా ఉద్యోగులు, సంఘ నేతలతో కలిసి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. సహకారశాఖ నియంత్రణలో పనిచేస్తున్న గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులను డీసీవో ఎస్‌వీ.ప్రసాద్‌ వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.     

                                                    

సహకారశాఖలో వివాదానికి బీఎ్‌సఎన్‌ఎల్‌ స్కాం కారణమని తెలుస్తోంది. ప్రభుత్వశాఖల్లో ఆడిట్‌ నిర్వహించే బాధ్యత సహకారశాఖకు ఉం టుంది. అయితే బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయంలో రూ.20కోట్ల స్కాం వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగి స్తూ సహకార శాఖ కమిషనర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. బీఎ్‌సఎన్‌ఎల్‌లో పనిచేసే ఉద్యోగులు వెల్ఫేర్‌ పేరుతో సంస్థకు కొంత మొత్తం డిపాజిట్లు చేశారు. దీనితో వారికి ప్రయోజ నం చేకూరుతుండగా, నిబంధనలకు విరుద్ధంగా బీఎ్‌సఎన్‌ఎల్‌లో పనిచేయని వారి నుంచి కూడా డిపాజిట్లు తీసుకున్నట్టు సమాచా రం. బీఎ్‌సఎన్‌ఎల్‌ ఉద్యోగులు కాకుండా రిటైర్డ్‌ టీచర్లు, ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా సభ్యులుగా చేరారు. మొత్తం 498మంది డిపాజిట్లు చేశారు. రూ.20కోట్ల వరకు నిధులు సమకూరాక వీటిలో గోల్‌మాల్‌ జరగడంతో వివాదం నడుస్తోంది. ఈస్కాంపై ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారిని నియమించి విచారణ చేయిస్తున్న నేపథ్యంలో సహకారశాఖకు చెందిన ఐదుగురు ఆడిట్‌ అధికారులను బాధితులను చేస్తూ కమిషనర్‌ నోటీసులు జారీ చేశా రు.బీఎ్‌సఎన్‌ఎల్‌లో ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో రూ.20 కోట్ల వివాదం నడుస్తున్నా, డిపాజిట్ల విషయాన్ని ఆడిటర్లు పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణ నేపథ్యంలో వారికి మెమోలు ఇచ్చి ప్రస్తుతం విచారణ చేయిస్తున్నారు.ఈవివాదం నడుస్తున్న నేపథ్యంలోనే జిల్లా సహకారశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు, అధికారికి మధ్య వివాదం మొదలు కావడం,అది చిలికిచిలికి గాలివానలా మారుతోంది.


డీసీవోపై ఆరోపణలు ఇవీ..

జిల్లా సహకార అధికారిగా ఎంవీ.ప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులను పనిచేయనివ్వకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, గతం లో సంఘ ఆడిట్‌ ప్రాథమిక విచారణ సరిగా చేయలేదని షోకాజు నోటీసులు జారీ చేయడమేగాక సస్పెండ్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వని ఆడిటర్లపై ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌ ప్రతిపాదనలు కమిషనర్‌కు పంపించారని, ఈ విషయంపై డీసీవోను అడిగితే వాళ్లు పంపమంటే పంపానని, అక్కడికే పోయి మేనేజ్‌ చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతీ సమీ క్ష సమావేశంలో అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని, రూ.1లక్ష ఇవ్వాలని ఓ ఆడిటర్‌ను డిమాండ్‌ చేయడంతో పాటు బెదిరింపుల కు గురిచేసి గత ఏడాది అక్టోబరు 18న డబుల్‌ కాట్‌ బెడ్‌ను కొనుగోలు చేయించుకున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం నాటి ఆడిట్‌ రిపోర్టులో లోపాలు లేకున్నా, వాటిని కొత్తగా సృష్టించి మెమోలు జారీ చేయడం, మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అనారోగ్య కారణాలతో సెలవుల్లో ఉన్న ఉద్యోగులను కూడా వేధింపులకు గురిచేస్తున్నారని అం టున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సంఘం సీఈవోలను బెదిరించి ఒక్కో కొనుగోలు కేంద్రం నుంచి రూ.10వేల వరకు లంచం తీసుకున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా సం ఘాల్లో విధులు సక్రమంగా నిర్వహించడంలేదని బెదిరిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.20వేలు తీసుకున్నారని, జీవో 151కి విరుద్ధంగా సర్వీస్‌ రిజిస్టర్‌ ఓపెన్‌ చేయిస్తూ కొంత మంది నుంచి రూ.50వేల వరకు లంచం రూపం లో తీసుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.


అవన్నీ నిరాధారణమైన ఆరోపణలు : ఎస్‌వీ.ప్రసాద్‌, నల్లగొండ డీసీవో

బీఎ్‌సఎన్‌ఎల్‌ స్కాంలో అక్రమాలను నిరోధించడంతో పాటు ఆ కేసును సీబీసీఐడీకి అప్పజెప్పాం. అందులో ఆడిటర్లు లోపాలు చేయడమేకాకుండా స్కాంను గుర్తించకుండా పక్కన పెట్టినందుకు రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు ఐదుగురు ఆడిటర్లకు మెమోలు జారీ అయ్యాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర కమిషనర్‌ నిర్ణయాల మేరకే చార్జ్‌ మెమోలు ఇచ్చాం. బీఎ్‌సఎన్‌ఎల్‌ స్కాం నాలుగేళ్లుగా కొనసాగుతున్న వ్యవహారం. డిపాజిట్లు కేవలం బీఎ్‌సఎన్‌ఎల్‌ ఉద్యోగులు మాత్రమే చేయాల్సి ఉండగా, ఈ శాఖకు సంబంధంలేని వారు సభ్యులుగా ఉన్నారు. గతంలో చేసిన ఆడిటింగ్‌లో లోపాలను నేను సరిదిద్దుతున్నా. డబుల్‌ కాట్‌ బెడ్‌ను ఎవరి నుంచి తీసుకోలేదు. అవన్నీ అసత్య ఆరోపణలు మాత్రమే.


డీసీవోపై చర్యలు తీసుకోవాలి

వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగుల ధర్నా

నల్లగొండ టౌన్‌: సహకారశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డీసీ వో ఎస్‌వీ.ప్రసాద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎన్‌జీవో్‌స జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మంత్రవాది శ్రవణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. డీసీవో వేధింపులు, అక్రమాలకు పాల్పడుతున్నారని సహకారశాఖ గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాల అధ్వర్యంలో ఆ శాఖ ఉద్యోగులు డీసీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. వీరి నిరసనకు టీఎన్‌జీవో్‌స, టీజీవోస్‌, ఇతర సంఘాల నేతలు మద్దతుపలికారు. అనంతరం కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మోతీలాల్‌కు వినతిపత్రం సమర్పించా రు. ఈ సందర్బంగా శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ, సహకార శాఖ లో బీఎ్‌సఎల్‌ఎన్‌ ఉద్యోగుల పరపతి సహకార సంఘం ఎంక్వెయి రీ రిపోర్టు ఆధారంగా సామాన్య ఉద్యోగులపై డీసీవో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆడిట్‌ రిపోర్టులో లేని తప్పుల ను ఉద్యోగులకు ఆపాదిస్తూ 2020 తర్వాత జరిగిన అంశాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపడం, డబ్బులు వసూలు చేయడం, తీవ్ర పదజాలంతో దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. మాట వినకపోతే అంతు చూస్తాననడం జిల్లా అధికారికి ఇది ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా లో పనిచేసిన సమయంలో అక్కడి ఉద్యోగులను, ప్రజాప్రతినిధుల ను గౌరవించకపోవడం కారణంగానే అక్కడి నుంచి డీసీవోను ఇక్కడికి సాగనంపారని, పరిపాలన దక్షతలేని, అవినీతిమయమైన డీసీవోను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను విస్తృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎండీ.ముజీబుద్దీన్‌, కార్యదర్శి కిరణ్‌కుమార్‌, నాయకులు ఎం.మాధవి, మురళి, వంగూరు విజయ్‌కృష్ణ, ఎంఏ.అలీం, వి.శ్యామ్‌కుమార్‌, భాస్కర్‌, లక్ష్మీ, ఎం.జయరావ్‌, టి.రమాదేవి, పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:53:20+05:30 IST