వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా మధ్య కోల్డ్ వార్

ABN , First Publish Date - 2020-09-17T04:06:37+05:30 IST

వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా మధ్య కోల్డ్ వార్

వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా మధ్య కోల్డ్ వార్

ఎన్నికల్లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు. కలిసికట్టుగా పని చేయాల్సిన వారే ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఆ ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు నిప్పుగా చిటపటలాడుతున్నారు. ఎవరికి వారే అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. వారి మధ్య చోటు చేసుకుంటున్న విభేదాలతో దూరం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇంతకీ ఎంపీకి, ఎమ్మెల్యేకు ఎందుకు పడటంలేదు. వారి మధ్య సక్యత బెడిసికొట్టడానికి కారణమేంటి?. 


ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా మధ్య కోల్డ్ వార్.  స్వపక్షంలో విపక్ష నేతలుగా నాయకుల వ్యవహారం. చింతలపూడిలో పట్టుకోసం ఏలూరు ఎంపీ ప్రయత్నాలు. ఎలీజా వ్యవహారం శైలితో ఇద్దరి మధ్య పెరుగుతుందట దూరం. 


పశ్చిమ గోదావరి  జిల్లాలో వైసీపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే  ఎలీజా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న సెటైర్లు లోకల్‌గా హీట్ పెంచుతున్నాయట. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఇద్దరి మధ్య ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 



కరోనా లాక్‌డౌన్‌కు ముందు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వైరం మొగ్గతొడగ్గా తాజాగా మరింత ముదిరిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. చిన్న చిన్న కారణాలే వీరి మధ్య దూరం పెంచాయని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చింతలపూడి నియోజకవర్గంపై తమ కుటుంబానికి ఉన్న పట్టు నిలుపుకోవడానికి కోటగిరి శ్రీధర్ చేస్తున్న ప్రయత్నం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అటు ఎమ్మెల్యే ఎలీజా వ్యవహార శైలి మరో కారణమని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-09-17T04:06:37+05:30 IST