తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

ABN , First Publish Date - 2021-12-16T16:21:33+05:30 IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. చల్లగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. విశాఖ, లంబసింగిలో కనిష్ట ఉష్టోగ్రత 10 డిగ్రీలకు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. చలితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఏజెన్సీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. చలి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో గిరిజనులు రోజు వారీ కార్యక్రమాలు చేసుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. చలికి జనాలు అల్లాడుతున్నారు. పొగమంచువల్ల ఉదయం 9 గంటలు దాటితే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.

Updated Date - 2021-12-16T16:21:33+05:30 IST