హెలికాప్టర్‌ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ ప్రకటన

ABN , First Publish Date - 2021-12-09T17:48:43+05:30 IST

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ కీలక ప్రకటన చేసింది.

హెలికాప్టర్‌ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ ప్రకటన

కోయంబత్తూరు: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ కీలక ప్రకటన చేసింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిపింది. అత్యవసర సహాయం అవసరమైతే ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారని, ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటే... పైలెట్‌ ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ద్వారా సాయం కోరుతారని ఏటీసీ వెల్లడించింది. 4వేల అడుగుల తర్వాత ఏటీసీ నుంచి వెల్లింగ్టన్‌ బేస్‌కు ఛేంజ్‌ ఓవర్‌ అయ్యారని, ఆ తర్వాత ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. కోయంబత్తూరులో తక్కువ ఎత్తులో ప్రయాణించే... విమానాలు, చాపర్లను గుర్తించే రాడార్‌ వ్యవస్థ లేదని ఏటీసీ పేర్కొంది.

Updated Date - 2021-12-09T17:48:43+05:30 IST