Abn logo
Jul 10 2020 @ 00:15AM

కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్ రామ్‌కుమార్‌ రామ్మూర్తి రాజీనామా

కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌కుమార్‌ రామ్మూర్తి రాజీనామా చేశారు. కాగ్నిజెంట్‌లో 23 ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయన ఈ నెల 17న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. గత ఏడాది సెప్టెంబరు లో ఈయన కాగ్నిజెంట్‌ ఇండియా సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. కాగా రామ్మూర్తితో పాటు కాగ్నిజెంట్‌ గ్లోబల్‌ డెలివరీ హెడ్‌గా ఉన్న ప్రదీప్‌ శిలిగే కూడా రాజీనామా చేశారు. 


Advertisement
Advertisement
Advertisement