ప్రసవ రిస్క్‌లకు కాగ్నిటివ్‌ కేర్‌ ఏఐ సొల్యూషన్‌

ABN , First Publish Date - 2020-10-20T05:37:08+05:30 IST

ప్రసవ సమయం, శిశు ఆరోగ్యంలో ఎదురయ్యే ఆరోగ్య రిస్క్‌లను ముందుగానే అంచనా వేయడానికి హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటివ్‌ కేర్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాఽధులు రావడానికి....

ప్రసవ రిస్క్‌లకు కాగ్నిటివ్‌ కేర్‌ ఏఐ సొల్యూషన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రసవ సమయం, శిశు ఆరోగ్యంలో ఎదురయ్యే ఆరోగ్య రిస్క్‌లను ముందుగానే అంచనా వేయడానికి హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటివ్‌ కేర్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాఽధులు రావడానికి ఉన్న అవకాశాలు.. వాటి లక్షణాలను ముందుగానే  పసిగట్టే ఏఐ సొల్యూషన్లను కాగ్నిటివ్‌ కేర్‌ అభివృద్ధి చేస్తోంది. మెటర్నల్‌ ఇన్‌ఫాంట్‌ హెల్త్‌ ఇన్‌సైట్స్‌ అండ్‌ కాగ్నిటివ్‌ ఇంటెలిజెన్స్‌ (ఎంఐహెచ్‌ఐసీ)ను ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు కచ్చితత్వం ఆశాజనకంగా ఉందని కాగ్నిటివ్‌ కేర్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట నరసింహం పెరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు ప్రసవ సమయంలో 800 మందికి పైగా మహిళలు మరణిస్తున్నారు. ఇటువంటి రిస్క్‌లను ముందుగానే అంచనా వేయడానికి ఏఐ దోహదపడుతుందని చెప్పారు. 

Updated Date - 2020-10-20T05:37:08+05:30 IST