కాఫీ పొడి ఇలా కూడా..!

ABN , First Publish Date - 2021-01-25T07:10:03+05:30 IST

కాఫీ చాలామంది ఫేవరేట్‌ డ్రింక్‌. అయితే కాఫీ పొడితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే...

కాఫీ పొడి   ఇలా కూడా..!

కాఫీ చాలామంది ఫేవరేట్‌ డ్రింక్‌.  అయితే కాఫీ పొడితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే...



కాఫీ గింజలను మెత్తగా పొడిచేసి చర్మానికి స్క్రబ్‌గా వాడితే చర్మంలోని టాక్సిన్లన్నీ పోయి మృదువుగా తయారవుతుంది.

కాఫీ గింజలను పొడి చేసి  గాలిపోయే పల్చటి గుడ్డలో పోసి పెడితే మంచి ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది.

కాఫీ గింజల్లో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. బ్రౌన్‌ కలర్‌లో ఉన్న ఆ పేస్టును ఆర్ట్‌ ప్రాజెక్టులో రకరకాల షేడ్స్‌ కోసం వాడొచ్చు.

వాడేసిన కాఫీ పొడిని  కప్పులో పోసి ఫ్రిజ్‌లో పెడితే ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన రాదు.

చాకొలేట్‌  డెజర్టుల మీద కాఫీ పొడిని చల్లితే మంచి సువాసన వస్తుంది. యమ్మీగా కూడా ఉంటుంది.

మోల్టెన్‌ వ్యాక్సులో కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని మూసలో పోయాలి. అది గట్టిగా అయిన తర్వాత తీసి చూస్తే కాఫీ క్యాండిల్స్‌ రెడీ.

కాఫీ పొడి మంచి స్క్రబ్బర్‌ కూడా. దీంతో గిన్నెలపై, ప్యాన్లపై ఏర్పడ్డ నల్లమచ్చలను పోగొట్టవచ్చు.

బ్రూకాఫీని చల్లారనిచ్చి దాన్ని వెంట్రుకలకు రాసుకుని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడుతుంటుంది.

వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన వంటకాలు తిన్నప్పుడు చేతులకు వాటి వాసన అంటి ఉంటుంది. అది పోవాలంటే  అరచేతుల్లో  కాస్త కాఫీ పొడిని వేసుకుని బాగా రుద్ది కడుక్కుంటే  వాటి వాసన పోతుంది. 

Updated Date - 2021-01-25T07:10:03+05:30 IST