Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాఫీతో కిడ్నీలు పదిలం!

కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ కాఫీని తాగితే వారు చ‌నిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని పరిశోధకులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌పై కాఫీ ప్ర‌భావం అనే అంశంపై ఇటీవల ప‌రిశోధ‌న చేశారు. మొత్తం 4863 మందిని ప‌రిశీలించారు. తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శ‌రీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. ఇది కిడ్నీల ప‌నితీరును కొంత వ‌ర‌కు సరిచేస్తుంద‌ట‌. అందువ‌ల్ల కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ కాఫీని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల వారు ఆ వ్యాధుల‌తో చ‌నిపోయే అవ‌కాశాలు కూడా 25 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయట‌. అంటే ఆ మేర జీవ‌న కాలం పెరుగుతుంద‌ని అర్థం. కాఫీ తాగడం వలన కిడ్నీలు పనితీరు మెరుగుపడడమే కాకుండా పలురకాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చనీ, జీవనకాలం పెంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...