కొబ్బరి తీపి కుడుములు

ABN , First Publish Date - 2020-06-29T18:47:45+05:30 IST

పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు, బెల్లం పొడి - ముప్పావు కప్పు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, బియ్యప్పిండి

కొబ్బరి తీపి కుడుములు

కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు, బెల్లం పొడి - ముప్పావు కప్పు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, బియ్యప్పిండి - ఒక కప్పు. నీరు - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - చిటికెడు.


తయారుచేసే విధానం: ఒక టేబుల్‌ స్పూను నెయ్యిలో బెల్లం పొడి, పచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా వేగించి దించి చల్లారనివ్వాలి. కడాయిలో బియ్యప్పిండి చిన్నమంటపై వేగించాలి. నీటిలో ఉప్పు, ఒక టీ స్పూ నెయ్యి వేసి మరిగించి పిండిలో కలిపి ముద్దగా చేయాలి. కొద్ది కొద్ది పిండి ముద్ద తీసుకుని నెయ్యి రాసిన అదే సైజులో పొడి అరటాకు మీద పూరీ సైజులో ఒత్తాలి. దీంట్లో కొబ్బరి మిశ్రమం కొంత పెట్టి కజ్జికాయలా మడవాలి. ఇవన్నీ ఇడ్లీ కుక్కర్లో ఆవిరిపై 15 నిమిషాలు ఉడికించాక, వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. 

Updated Date - 2020-06-29T18:47:45+05:30 IST