కొబ్బరి పాలతో పట్టులాంటి జుట్టు

ABN , First Publish Date - 2021-01-24T06:39:45+05:30 IST

శిరోజాల సంరక్షణకు, చర్మ సౌందర్యానికి కొబ్బరిపాలు చక్కగా పనిచేస్తాయి. ఎలా అంటే...

కొబ్బరి పాలతో పట్టులాంటి జుట్టు

  • శిరోజాల సంరక్షణకు, చర్మ సౌందర్యానికి కొబ్బరిపాలు చక్కగా పనిచేస్తాయి. ఎలా అంటే...


  1. కొబ్బరిపాలను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరి పాలలోని కొవ్వు, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, భాస్వరం, పొటాషియంలు కురులను పటిష్టంగా ఉంచుతాయి.
  2. కొబ్బరిపాలలో బి12, జింక్‌ వంటి  పోషకపదార్థాలు ఉన్నాయి. ఇవి తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు సమస్యలు తగ్గి శిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. 
  3. కొబ్బరిపాల వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది. వెంట్రుకలు చిట్లిపోవు. పైగా పొడిజుట్టును నివారిస్తుంది.
  4. చుండ్రు నుంచి రక్షిస్తుంది. బట్టతల రాకుండా  కాపాడుతుంది.
  5. జుట్టులోని ప్రొటీన్లు పోకుండా కొబ్బరిపాలు సహాయపడతాయి. అంతేకాదు అతినీలలోహిత కిరణాల వల్ల శిరోజాలు దెబ్బతినకుండా కొబ్బరిపాలు కాపాడతాయి. 
  6. జుట్టు పెరగడానికి కొబ్బరిపాలను నేరుగా  జుట్టుకు పట్టించవచ్చు. పావు కప్పు కొబ్బరిపాలను గోరువెచ్చగా వేడిచేసి పదిహేను నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత షాంపుతో స్నానం చేయాలి. వారానికి ఒకసారి  ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. 
  7. నిమ్మరసంలో సి విటమిన్‌ ఉంటుంది. దీన్ని కొబ్బరిపాలలో కలిపి తలకు మసాజ్‌ చేసుకుంటే కూడా వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అంతేకాదు జుట్టు  రాలడం తగ్గుతుంది. 
  8. పొడి బారిన జుట్టుకు కొబ్బరి పాలను పట్టిస్తే జుట్టు పట్టులా తయార వుతుంది.  వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది. 
  9. జుట్టుకు కండిషనర్‌లా కొబ్బరిపాలు ఉపయోగపడతాయి. షాంపుతో తలస్నానం చేశాక కొద్దిగా కొబ్బరిపాలను తలకు పట్టించి రెండు నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలి. 
  10. ఒక టీ స్పూన్‌ కొబ్బరి పాలకు, రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను కలిపి దానితో ముఖానికి మసాజ్‌ చేసుకుని దూదితో తుడిచేసుకోవాలి. చర్మం జిడ్డుగా, మొటిమలతో ఉంటే ఇలా నూనెలో కొబ్బరిపాలు కలిపి వాడడంతో చర్మంలోని బాక్టీరియా  పోతుంది. 
  11. చర్మం ముడతలు రాకుండా, వయసు కనిపించకుండా చర్మాన్ని మృదువుగా, పట్టులా ఉండేలా కొబ్బరిపాలు చేస్తాయి. బాదంపొడి, తేనె, కొబ్బరిపాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని రెండు నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.

Updated Date - 2021-01-24T06:39:45+05:30 IST