Abn logo

కొబ్బరిపాల చికెన్‌

కావలసిన పదార్థాలు: చికెన్‌ - అరకేజీ, కొబ్బరి పాలు - రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, జీరాపొడి, కారం - 1 స్పూను చొప్పున, మిరియాల పొడి - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు స్పూను, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 8 రెబ్బలు, నూనె - పావు కప్పు, యాలకులు, లవంగాలు - 3 చొప్పున, దాల్చినచెక్క - అరంగుళం, ఉల్లి తరుగు - ఒక కప్పు, మిరియాల పొడి - అర స్పూను; మసాల పొడి కోసం: మిరియాలు - 10, దాల్చినచెక్క - అంగుళం, యాలకులు, లవంగాలు - 3 చొప్పున, బిర్యాని ఆకు - 1.


తయారుచేసే విధానం: చికెన్‌లో అల్లం వెల్లుల్లి, ఉప్పు, గరం మసాల, జీరా, పసుపు, ధనియా, కారం, మిరియాల పొడులు, పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్‌ స్పూను నూనె, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, 4 రెబ్బల కరివేపాకు, పావుకప్పు కొబ్బరిపాలు వేసి బాగా కలిపి 6 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.  కడాయిలో నూనె వేసి మసాల పొడి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించి చికెన్‌ మిశ్రమం కలిపి మూతపెట్టాలి. ముక్క మెత్తబడి నూనె తేలాక మిగతా కొబ్బరిపాలు పోయాలి. కర్రీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.

క్విక్‌ చికెన్‌! హనీ గార్లిక్‌ చికెన్‌! మరాక్‌చాట్‌పటి మచ్చీహైదరాబాద్‌ దమ్‌ కా ముర్గ్‌ప్రాన్స్‌ టిక్కా మసాలాబొమ్మిడాయిలు పాలకూరబోటీ చారు / దప్పడంకాళ్ల కూర / పాయతెలంగాణ చికెన్‌ కూర
Advertisement
Advertisement