Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూడు రోజుల పాటు వ్యక్తి చెవిలో తిష్ట వేసిన బొద్దింక.. చివరకు

అక్లాండ్: న్యూజిలాండ్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు ఒక వ్యక్తి చెవిలో ఓ బొద్దింక తిష్ట వేసింది. దాంతో అతడు నరకయాతన అనుభవించాడు. చివరకు వైద్య నిపుణుల వద్దకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వైద్యులు దానిని బయటకు తీయడంతో ఊపిరిపీల్చుకున్నాడు. న్యూజిలాండ్​లోని అక్లాండ్​లో జరిగిందీ ఘటన. అసలేం జరిగిందంటే.. స్థానికంగా ఉండే జెన్​ వెడ్డింగ్​(40) అనే వ్యక్తి ఎప్పటిలాగే స్విమ్మింగ్​ పూల్​లో ఈత కొట్టి వచ్చి పడుకున్నాడు. అయితే, పడుకున్న కొద్దిసేపటి తర్వాత జేన్​‌కి చెవిలో ఏదో దురదగా అనిపించింది. చెవి లోపలికి నీరు పోయి ఉంటుందని మొదట తేలిగ్గా తీసుకున్నాడు. కానీ, సమయం గడిచే కొద్ది బాగా సమస్యగా అనిపించడం మొదలైంది. చెవి లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపించింది జెన్‌కు. దాంతో వెంటనే డాక్టర్​ దగ్గరికి వెళ్లాడు​. అతడి చెవిని పరిశీలించిన డాక్టర్.. యాంటీబయాటిక్స్​ ఇవ్వడంతో పాటు హెయిర్​ డ్రయర్​తో చెవి లోపల శుభ్రం చేసుకోవాలని చెప్పి పంపించాడు.


అయితే, వైద్యుడి దగ్గరకు వెళ్లిన జెన్ చెవి సమస్య మాత్రం తీరలేదు. ఆ తర్వాతి రోజు నుంచి ఓ చెవి మొత్తం వినిపించడం మానేసింది. లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపించడంతో నిద్ర పట్టట్లేదు. వైద్యుడి సలహా మేరకు డ్రయర్‌తో చెవిని శుభ్రం చేసుకున్న ఫలితం లేకుండా పోయింది. దాంతో​ తప్పని పరిస్థితుల్లో జెన్ మరోసారి ఈఎన్‌టీ స్పెషలిస్ట్​ దగ్గరకు వెళ్లాడు. జెన్ చెవిని పరిశీలించిన వైద్యురాలు లోపల ఏదో కీటకం ఉన్నట్లు గుర్తించింది. ట్వీజర్లు ఉపయోగించి చెవిలో నుంచి దాన్ని బయటకు తీసింది. తీరా చూస్తే అది చనిపోయిన బొద్దింక. ఆ బొద్దింకను చూసి జెన్​ షాక్ అయ్యాడు. అసలు అది చెవి లోపలకు ఎలా వెళ్లింది, ఎప్పుడు వెళ్లిందో కూడా అతనికి తెలియలేదట. మూడు రోజుల పాటు తన చెవిలో బొద్దింక ఉన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు జెన్.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement