12 రాష్ట్రాల్లోని మూడున్నర లక్షలమంది రైతుల జీవితాలను స్పృశించిన కోకాకోలా ‘ప్రాజెక్ట్ ఉన్నతి’

ABN , First Publish Date - 2022-08-05T01:20:40+05:30 IST

ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకాకోలా తన ‘ప్రాజెక్ట్ ఉన్నతి’ ద్వారా 12 రాష్ట్రాల్లో మూడున్నర లక్షలమందికిపైగా పండ్ల

12 రాష్ట్రాల్లోని మూడున్నర లక్షలమంది రైతుల జీవితాలను స్పృశించిన కోకాకోలా ‘ప్రాజెక్ట్ ఉన్నతి’

న్యూఢిల్లీ:  ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకాకోలా తన ‘ప్రాజెక్ట్ ఉన్నతి’ ద్వారా 12 రాష్ట్రాల్లో మూడున్నర లక్షలమందికిపైగా పండ్ల రైతుల జీవితాలను స్పృశించింది. సాగు సామర్థ్యాన్ని పెంచడం, అనుసంధానతను బలోపేతం చేయడం, దేశంలో ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం వంటి భారతీయ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే ఈ ‘ప్రాజెక్ట్ ఉన్నతి’ లక్ష్యం. ఐదు పండ్ల రకాలు మామిడి, ఆపిల్, ఆరంజ్, ద్రాక్ష, లిచీతోపాటు చెరకు పంటలపై దృష్టి సారిస్తూ వ్యవసాయ ఉత్పాదనను వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకొంది. 


తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నతి ప్రాజెక్టుల ద్వారా మంచి వ్యవసాయ పద్ధతులను(GAP) అనుసరించడంతో అత్యంత అధిక సాంద్రత పండ్ల మొక్కల పెంపకపు సాంకేతిక పరిజ్ఞానము ద్వారా ఐదురెట్ల పండ్ల ఉత్పాదకత పెంపొందగలిగింది. అలాగే, కోకా కోలా ‘మీఠా సోనా ఉన్నతి’ కార్యక్రమం చిన్నతరహా చెరకు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రస్తావించడానికి, వారి జీవనోపాధులను పెంపొందించడానికి, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే చెరకు సాగును ప్రోత్సహించడానికి ఉద్దేశించినది. 


 ఈ సందర్భంగా కోకా కోలా కంపెనీ ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా (INSWA) సీఎస్ఆర్, సుస్థిరత అంశాల డైరెక్టర్ రాజేష్ అయపిళ్లా మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ఉన్నతి ద్వారా ఈ రైతులకు అధునాతన పండ్ల తోటల సాగు పద్ధతులకు వీలు కల్పించడం,వారి జీవనోపాధుల్ని వృద్ధి చేయడం, పెంపొందించడం మాత్రమే కాకుండా వారి ఆదాయాలు గణనీయంగా పెంచుకునేలా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు.   ఆంధ్రప్రదేశ్ లో 'ప్రాజెక్ట్ ఉన్నతి మ్యాంగో’ తో 2011లో మొదటి అడుగువేసిన కోకాకోలా.. 2018 లో మహారాష్ట్రలో 'ఉన్నతి ఆరంజ్' ప్రారంభించింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకాశ్మీర్‌లో ‘ఉన్నతి ఆపిల్’కి, అనంతరం దశాబ్దకాలంగా లిచీ, ద్రాక్షకు పొడిగించబడింది.  ప్రాజెక్ట్ ఉన్నతిలో.. ఉన్నతి మ్యాంగో,  ఉన్నతి ఆరెంజ్,  ఉన్నతి ఆపిల్,  ఉన్నతి ద్రాక్ష, ఉన్నతి లిచీ వంటివి ఉన్నాయి. 

Updated Date - 2022-08-05T01:20:40+05:30 IST