Snake: షూలో నాగుపాము

ABN , First Publish Date - 2022-08-03T19:08:28+05:30 IST

వర్షాకాల సమయంలో పాములు(Snakes), తేళ్లు, జెర్రులు వంటివి ఇళ్లలోకి దూరి ఎక్కడ పడితే అక్కడ దాక్కునే అవకాశాలు ఉన్నాయని ఒకింత

Snake: షూలో నాగుపాము

బెంగళూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వర్షాకాల సమయంలో పాములు(Snakes), తేళ్లు, జెర్రులు వంటివి ఇళ్లలోకి దూరి ఎక్కడ పడితే అక్కడ దాక్కునే అవకాశాలు ఉన్నాయని ఒకింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ(Department of Health) అధికారులు హెచ్చరిస్తున్నారు. శివమొగ్గ నగర శివారులోని బొమ్మనకట్టె గ్రామంలోని ఓ ఇంట్లో దాదాపు మూడు అడుగుల పొడవైన నాగుపాము ఒకటి షూలో దాక్కుని ఉండగా సోమవారం గుర్తించారు. నాగుపాము పైకి కనిస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్నేక్‌ కిరణ్‌కు సమాచారం అందించగా పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేశాడు. బూట్‌లు, చెప్పులు ధరించే ముందు ఒకసారి వాటిని దులపాలని స్నేక్‌ కిరణ్‌ స్థానికులకు సూచించారు. 

Updated Date - 2022-08-03T19:08:28+05:30 IST