నక్సల్స్‌ ఐఈడీ పేలుడులో.. కోబ్రా అధికారి దుర్మరణం

ABN , First Publish Date - 2020-11-30T08:02:49+05:30 IST

మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చిన ఘటనలో ఓ అసిస్టెంట్‌ కమాడెంట్‌ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మాజిల్లా తాడిమెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. తొలుత ఐదుగురు అనుకున్నా..

నక్సల్స్‌ ఐఈడీ పేలుడులో.. కోబ్రా అధికారి దుర్మరణం

దుమ్ముగూడెం/చర్ల, నవంబరు 29: మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చిన ఘటనలో ఓ అసిస్టెంట్‌ కమాడెంట్‌ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మాజిల్లా తాడిమెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. తొలుత ఐదుగురు అనుకున్నా.. తొమ్మిది మంది జవానులు గాయపడ్డట్లు సమాచారం. వారిలో కోబ్రా-206 బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌.పి.భలేరావు(33) చికిత్స పొందుతూ.. ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. తుది శ్వాస విడిచే ముందు.. ‘‘ఆల్‌ ద బెస్ట్‌.. కిల్‌ ద బీస్ట్‌ (మీకు శుభం జరుగుగాక.. మృగాలను అంతమొందించండి)’’ అంటూ తన తోటి జవాన్లకు సందేశమిచ్చారు. కాగా.. పనిఒత్తిడి, సెలవులు లేకపోవడం వంటి కారణాలతో ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు సర్వీసు రైఫిళ్లతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద పోలీసులు ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-11-30T08:02:49+05:30 IST