కోల్‌మైన్స్‌ రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ను సవరించాలి

ABN , First Publish Date - 2022-06-27T06:34:08+05:30 IST

దేశంలో ఉన్న బొగ్గు గనుల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన కార్మికుల పెన్షన్‌ను సవరించాలని కోల్‌మైన్స్‌ రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, సింగరేణి మాజీ డైరెక్టర్‌ జేవీ దత్తాత్రేయులు, రిటైర్డ్‌ సీజీఎం కేఆర్‌సీ రెడ్డిలు అన్నారు.

కోల్‌మైన్స్‌ రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ను సవరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేవీ దత్తాత్రేయులు

సింగరేణి మాజీ డైరెక్టర్‌ జేవీ దత్తాత్రేయులు

గోదావరిఖని, జూన్‌ 26: దేశంలో ఉన్న బొగ్గు గనుల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన కార్మికుల పెన్షన్‌ను సవరించాలని కోల్‌మైన్స్‌ రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, సింగరేణి మాజీ డైరెక్టర్‌ జేవీ దత్తాత్రేయులు, రిటైర్డ్‌ సీజీఎం కేఆర్‌సీ రెడ్డిలు అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌సీఓఏ క్లబ్‌లో జరిగిన ఆల్‌ ఇండియా కోల్‌ పెన్షనర్స్‌, కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. 1998లో కోల్‌ ఇండియాలో పని చేసి పదవీవిరమణ పొందిన కార్మికులకు 10నెలల యావరేజ్‌ వేతనంపై 25శాతం మాత్రమే పెన్షన్‌ చెల్లిస్తున్నారని, ఈ పెన్షన్‌తో పదవీవిరమణ పొందిన కార్మికుల కుటుంబాలు పూట గడవడం కూడా కష్టమవుతుందన్నారు. ప్రతీ మూడు సంవత్సరాలకో సా రి పెన్షన్‌ను సవరించాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ 24 సంవత్సరాలు గడుస్తున్నా పెన్షన్‌ సవరణ జరుగలేదన్నారు. 24 సంవత్సరాలు గడిచినా సీఎంపీఎఫ్‌ ట్రస్ట్‌బోర్డు కానీ, కేంద్ర కార్మికశాఖ గానీ, వేజ్‌బోర్డు కమిటీ కానీ పెన్షన్‌ను పెంచలేదన్నారు. 8వ వేజ్‌బోర్డు మధ్యలో పదవీ విరమణ పొందిన కార్మికులకు రూ.350 నుంచి రూ.5000వరకు మాత్రమే పెన్షన్‌ వస్తుందని చెప్పారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు పెన్షన్‌ను పెంచాలంటూ జూలై 25న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపడుతామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి వేజ్‌బోర్డును సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను సవరించాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ ప్రధానకార్యదర్శి జనక్‌ప్రసాద్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షు డు తుమ్మల రాజారెడ్డి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు బాబురావు, పీటీ స్వామి, పూరెళ్ల వెంకటేశం పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:34:08+05:30 IST