గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత: శ్రీధర్

ABN , First Publish Date - 2022-04-10T23:31:03+05:30 IST

గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కోల్ ఇండియాకు రూ.150 కోట్లు చెల్లించాలన్నారు.

గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత: శ్రీధర్

అమరావతి: గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కోల్ ఇండియాకు రూ.150 కోట్లు చెల్లించాలన్నారు. హిందూజాకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. దీనిని ఏపీలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగిందని, దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడిందన్నారు. బొగ్గు కొరత, వినియోగం పెరగడం వల్ల విద్యుత్‌ కొరత ఏర్పడిందన్నారు. నెలాఖరులోగా సమస్య పరిష్కారం అవుతుందని శ్రీధర్ తెలిపారు.

Updated Date - 2022-04-10T23:31:03+05:30 IST