సీసీఐలో బొగ్గు నిల్వలు నిల్‌

ABN , First Publish Date - 2022-05-27T04:53:26+05:30 IST

సీసీఐలో బొగ్గు నిల్వలు నిల్‌

సీసీఐలో బొగ్గు నిల్వలు నిల్‌

  •  నిలిచిపోయిన సిమెంటు ఉత్పత్తులు

తాండూరు రూరల్‌, మే 26(ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామ సమీపంలో కేంద్రప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న సిమెంటు కర్మాగారంలో బొగ్గు నిల్వలు లేక సిమెంటు ఉత్పత్తులు గురువారం మధ్యాహ్నం నిలిచిపోయాయి. కాగా, ఈ కర్మాగారంలో ప్రతిరోజూ 3వేల మెట్రిక్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతుంది. అయితే, సిమెంటు ఉత్పత్తులకు అవసరమయ్యే ముడి సరుకుల్లో భాగంగా.. బొగ్గు నిల్వలు లేక పోవడంతో కోల్‌మిల్‌లో సిమెంటు ఉత్పత్తులు నిలిచిపోయాయి. రోజుకు 300 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం ఉండగా.. 15రోజుల క్రితం బొగ్గు లేకపోవడంతో ఉత్పత్తులు వారం రోజులపాటు నిలిచిపోయాయి. యాజమాన్యం ఇటీవల ఒక వ్యాగిన్‌  బొగ్గు తెప్పించడంతో తిరిగి వారం రోజుల పాటు సిమెంట్‌ ఉత్పత్తి  చేశారు. ప్రస్తుతం బొగ్గు పూర్తిగా లేకపోవడంతో సిమెంటు ఉత్పత్తులను నిలిపివేసింది.  

Updated Date - 2022-05-27T04:53:26+05:30 IST